
తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లు సామెత. రాజమార్గమే రాచమార్గం దొడ్డి దారి అందరికి అడ్డదారే. మన సుదీర్ఘ ప్రయాణంలో మచ్చలేని వారిగా మసగాలంటే మనకు ఎలాంటి మచ్చ అంటకుండా చూసుకోవాలి. ఆ దిశగానే ప్రయాణం చేయాలి. అంతేగాని ఎటు వీలైతే అటు వెళితే తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలాగే తయారయింది. ఇన్నాళ్లు పార్టీని గట్టెక్కించే వారు రేవంత్ రెడ్డి ఒక్కరే అని అనుకున్నారు. కానీ ఆయన మెడకు ఓటుకు నోటు కేసు చుట్టుకుంది. దీంతో ఆయన భవితవ్యం అంధకారంలో పడిపోయంది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ కేసులో ఇరుక్కోవడంలో స్వయంకృతాపరాధం ఉన్నా ఆయనంటే పడని నాయకుల పన్నాగంగా కూడా తెలుస్తోంది.
ఆరేళ్ల క్రితం కేసు ఒక్కసారిగా వెలుగులోకి రావడం చర్చనీయాంశం అయింది. పార్టీలోని సీనియర్లు రేవంత్ ను అడ్డుకోవడానికి చేసిన కుట్రలో భాగమే ఈ కేసు అని తెలుస్తోంది. ఒకసారి పార్టీ ఆయన చేతిలోకి వెళితే ఇక అంతే అని వారు హైరానా పడి ఆయన రాకను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. కానీ ఇలా కేసులో ఇరుక్కోవడంతో ఆయన భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న నాయకులు, బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నేతలు అందరికీ రేవంత్ రెడ్డే టార్గెట్. దీంతోనే కేసులో ఇరికించారనే ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ లో దూకుడు కలిగిన నేతల్లో రేవంత్ రెడ్డి ముఖ్యుడు. రాష్ర్ట కాంగ్రెస్ ను గాడిలో పెట్టిన నేతగా వైఎస్ఆర్ కే పేరుంది. ఆ తరువాత అంతటి ఇమేజ్ సాధించిన నాయకుడు రేవంతే. కాంగ్రెస్ లో ముఠా కక్షలు కొత్తేమీ కాదు. కాంగ్రెస్ ను గాడిలో పెట్టే నేతగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డికి తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయను నిలువరించాలనే ఉద్దేశంతో ఇలా కేసులో ఇరికించారే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోలేకపోయింది. టీఆర్ఎస్ మాత్రమే ప్రయోజనం సాధించుకుంది.
రేవంత్ రెడ్డి వ్యూహ నైపుణ్యంలో దిట్ట. రాజకీయంగా ఎదగాలని భావించిన రేవంత్ పైకెదగాలనే ప్రయత్నంలో బాగంగా ఓటుకు నోటు కేసు మెడకు చుట్టుకుంది. ఇందులో చంద్రబాబు ాయుడుకు సైతం ప్రమేయం ఉన్నా ఆయనను పక్కన పెట్టేశారు. రేవంత్ రెడ్డిని మాత్రం బలిపశువును చేశారు. దీంతో కేసులున్నా పట్టించుకోకుండా అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తుందా? వేరే నాయకుడికి అవకాశం ఇస్తుందా అని అనుమానాలు నాయకుల్లో మొదలైంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి మరో మంచి అవకాశం చేజారినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.