ఆ పని చేసేవాళ్లకు అలర్ట్.. కరోనా సోకే ఛాన్స్ ఎక్కువట..?

కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పొగాకు తినేవాళ్లు కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ధూమపానం చేసేవాళ్లకు కరోనా ప్రమాదం 50 శాతం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేసేవాళ్లు తీవ్రమైన అనారోగ్యంతో మరణించే […]

Written By: Navya, Updated On : May 30, 2021 10:14 am
Follow us on

కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పొగాకు తినేవాళ్లు కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ధూమపానం చేసేవాళ్లకు కరోనా ప్రమాదం 50 శాతం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ధూమపానం చేసేవాళ్లు తీవ్రమైన అనారోగ్యంతో మరణించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. వీళ్లు ఎక్కువగా క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పొగాకుకు దూరంగా ఉంటే మాత్రమే ఈ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అడ్నోమ్ ఘెబియస్ పొగాకు రహిత వాతావరణాన్ని సృష్టించాలని కోరారు.

అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, విధానాలను సవరించడం, జాతీయ టోల్ ఫ్రీ క్విట్‌లైన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 40 శాతం మంది పురుషులు, 10 శాతం మహిళలు పొగాకును ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నారు. ఐరోపాలో ధూమపానం రేటు ఏకంగా 26 శాతంగా ఉంది.

పొగాకు వల్ల శరీరానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. పొగాకు తాగేవాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన మనం ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవాన్ని జరుపుకుంటాము.