దేశంలో విజృంభిస్తున్న కరోనా ఉగ్ర రూపానికి తాజాగా జరుగుతున్న కొన్ని ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. యూపీలో ఒకే కుటుంబంలో 32 మంది కరోనా వైరస్ బారిన పడ్డారంటే వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో సులభంగానే అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ లోని బండా గ్రామంలో ఒకే ప్రాంతంలో నివశిస్తున్న కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ నిర్ధారణ అయింది.
Also Read : మధ్య తరగతి ప్రజలకు శుభవార్త..! ఈఎంఐలపై కేంద్రం సంచలన నిర్ణయం
ఒకే కుటుంబంలో అంత మందికి వైరస్ సోకడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానికులు సైతం అవాక్కయ్యారు. ఒకే కుటుంబంలో పెద్దఎత్తున కరోనా కేసులు నిర్ధారణ కావడంతో అధికారులు ఆ ప్రాంతమంతా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అదే ఏరియాలోని మరో 44 మందికి వైరస్ నిర్ధారణ అయింది. పరీక్షల్లో మొత్తం 76 మందికి కరోనా నిర్ధారణ కాగా బండా జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 807కు చేరింది.
యూపీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ డీ శర్మ ఈ విషయాలను వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా నమోదైన కేసులతో యూపీలో కరోనా కేసుల సంఖ్య 2,30,414 కు చేరింది. 3,486 మంది అక్కడ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా 70,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 36 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 65 వేల మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
Also Read : భారత్ లో కరోనా: ఒక్క ఆగస్టులోనే 20లక్షల కేసులు