
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఈరోజుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1995 సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన చంద్రబాబు తొలిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నేటితో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి 25 సంవత్సరాలు పూర్తైంది. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ కష్టపడి పెట్టిన పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఎన్టీఆర్ ను గద్దె దించి చంద్రబాబు సీఎం అయ్యారు.
Also Read : బ్రేకింగ్: చంద్రబాబుకు పోలీసుల నోటీసులు
చంద్రబాబు వెన్నుపోటు గురించి నేటికీ అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిపై లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎమ్మెల్యేలకు అసత్యాలు చెప్పి ఆ అసత్యాలనే నమ్మించి పదవీచ్యుతుడిని చేశారు. బంధాలు, అనుబంధాలను మరిచి చంద్రబాబు కఠినంగా వ్యవహరించిన తీరుపై అప్పట్లో ప్రజల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్టీఆర్ లాంటి మహానేతనే గద్దె దించడం చంద్రబాబు ప్రతిభకు తార్కాణమని విశ్లేషకులు నేటికీ చెబుతూ ఉంటారు.
అయితే 1999లో చంద్రబాబు అదృష్టం కలిసివచ్చి మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయ్‌తో పొత్తు, కాంగ్రెస్ గ్రూపు తగాదాలు పార్టీ విజయానికి కారణమయ్యాయి. అయితే ఉమ్మడి ఏపీలో బాబు తొమ్మిదేళ్ల పాలనను తలుచుకుంటే నేటికీ జనం గుండెలదురుతాయి. అణువంతైనా అభివృద్ధి జరగకుండా చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు పాలన సాగించడం గమనార్హం.
2004లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం పాలవగా 2009లో 2004తో పోలిస్తే ఎక్కువ సీట్లలోనే గెలుపొందినా అధికారానికి ఆమడ దూరంలోనే టీడీపీ ఆగిపోయింది. అయితే అదృష్టం కలిసివచ్చి బీజేపీ, జనసేనల సాయంతో 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు 2014 – 2019 పాలన ప్రజలకు గ్రాఫిక్స్ లో మాత్రమే కనిపించడం గమనార్హం. ఫలితంగా 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో 23 స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయానికి పాతికేళ్లు పూర్తి కావడంతో ఒక వర్గంలో చంద్రబాబుపై విమర్శలు వ్యక్తమవుతున్నా టీడీపీ శ్రేణులు మాత్రం సంబరాలు జరుపుకుంటుండం గమనార్హం.
Also Read : కోట్ల నిధులిస్తా.. వైసీపీ లేడి ఎమ్మెల్యేకే ఆఫర్?