సాధారణంగా సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు తినాలని ఎంతోమంది అనుకుంటుంటారు. ఖరీదు ఎంతైనా సరే వాటిని తినడానికి వెనకాడరు. ఇక అలానే ఈ సీజన్ లో దొరికే బోడ కాకరకాయ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది అందరికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ బోడ కాకరకాయలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభ్యం అవుతాయి.
Also Read : మధ్య తరగతి ప్రజలకు శుభవార్త..! ఈఎంఐలపై కేంద్రం సంచలన నిర్ణయం
ఇక బోడ కాకరకాయల గురించి తెలిసిన వాళ్ళు సీజన్ వచ్చిందంటే చాలు ఆకాకరకాయను తినడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ బోడ కాకరకాయ ఎక్కువగా అటవీ ప్రాంతాలలో వర్షాకాలంలో విరివిగా లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ బోడ కాకరకాయ కిలో 150 రూపాయలుపైన పలికిన దీని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ బోడ కాకరకాయతో వేపుడు, పులుసు, పొడి మొదలైనవి చేసుకొని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ బోడకాకరకాయలు రుచి మాత్రమే కాదు పోషక విలువలు, ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయ్. బోడ కాకరకాయలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ బోడ కాకరకాయ కూర తినడం వల్ల గర్భంలో ఉండే శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. బీపీ, షుగర్ ఎక్కువ ఉన్నవారికి సైతం ఈ బోడ కాకరకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న కెరోటినాయిడ్స్ వల్ల కంటి సంబంధిత వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్ ఇంకా ఇతర ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఈ బోడ కాకరకాయ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ బోదకాకరకాయ కరోనాతో పోరాడే శక్తిని కూడా అందిస్తుంది.
Also Read : కరోనా వైరస్ నుంచి రక్షించే ఏకైక విటమిన్ ఇదే!