https://oktelugu.com/

SP Balu Family Photos: వైరల్ అవుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ.. మీరు చూశారా?

SP Balu Family Photos: దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా కూడా ఆయన ఈ లోకంలోనే ఉన్నట్లు అనిపిస్తుంటారు. ఆయన పాడిన పాటలు, మాట్లాడిన మాటలు ప్రేక్షకులను ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈయన గత ఏడాది సెప్టెంబర్ 25న మరణించారు. ఈయన కెరీర్ మొదట్లో వెండితెరపై పలు సినిమాలలో అతిథి పాత్రల్లో నటించారు. ఆ తర్వాత సహాయ పాత్రలలో నటించారు. ఇక శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 25, 2021 / 09:39 AM IST
    Follow us on

    SP Balu Family Photos

    SP Balu Family Photos: దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా కూడా ఆయన ఈ లోకంలోనే ఉన్నట్లు అనిపిస్తుంటారు. ఆయన పాడిన పాటలు, మాట్లాడిన మాటలు ప్రేక్షకులను ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈయన గత ఏడాది సెప్టెంబర్ 25న మరణించారు. ఈయన కెరీర్ మొదట్లో వెండితెరపై పలు సినిమాలలో అతిథి పాత్రల్లో నటించారు.

    SP Balu Family Photos

    ఆ తర్వాత సహాయ పాత్రలలో నటించారు. ఇక శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకుడిగా పరిచయమయ్యారు బాలు. ఇక ఈ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు. పలు సినిమాలలో డబ్బింగ్ కూడా చేశారు.

    SP Balu Family Photos

    బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో చేశారు. ఈయన ఎంతోమంది గాయకులను పరిచయం చేశారు. అలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బాలు గత ఏడాది కోవిడ్ బారినపడి కోలుకున్నారు. ఆ తర్వాత వెంటనే శ్వాసకోశ సమస్యలు ఎదురవడంతో చికిత్స అందుకుంటూనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

    SP Balu Family Photos

    Also Read: చప్పుడు చేయకుండా ఓటీటీలోకి వచ్చిన ‘అన్నాత్తై’

    SP Balu with his Family

    ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతోమంది అభిమానులు తట్టుకోలేక పోయారు. ఇక ఇటీవలే ఆయన మరణించి ఏడాది కూడా పూర్తయింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు బాలు గారి ఫ్యామిలీ గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు. దీంతో బాలు గారి ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

    SP Balu Family Photos

    ఇక ఆయన భార్య పేరు సావిత్రి. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. తన కుమారుడు చరణ్ సింగర్. ఇక బాలు గారి సోదరి ఎస్ పి శైలజ గురించి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆ కుటుంబాన్ని చూస్తున్న బాలు అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. అందులో బాలు గారిని మిస్ అయ్యాము అంటూ బాధపడుతున్నారు.

    SP Balu Family Photos

    Also Read: దృశ్యం2 మూవీ రివ్యూ