Jason Sanjay Sigma movie update: తమిళనాట బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా, నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్న విజయ్(Thalapathy Vijay) సినిమాలకు గుడ్ బై చెప్పి TVK పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తో ఇప్పుడు ఆయన స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ స్థానం లో ఎవరు కూర్చుంటారు?, శివ కార్తికేయన్ కి ఆ అవకాశం ఉందా?, లేదా కొత్తగా ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడా అనే డిబేట్స్ సోషల్ మీడియా లో చాలా కాలం నుండి నడుస్తోంది. అసలు వీళ్లంతా ఎందుకు?, విజయ్ కొడుకు జేసన్ సంజయ్(Jason Sanjay) ఉన్నాడు కదా, హీరో గా నటించే వయస్సు వచ్చేసింది, కాబట్టి అతనే విజయ్ స్థానాన్ని ఆక్రమించుకోవచ్చు కదా అని సోషల్ మీడియా లో చర్చలు నడిచిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సంజయ్ హీరో గా కాదు, డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.
Also Read: అట్లీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమేనా..?
ఆయన దర్శకత్వం లో మన తెలుగు నటుడు సందీప్ కిషన్(Sandeep kishan) హీరో గా సిగ్మా అనే చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా సందీప్ కిషన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో విజయ్ కొడుకు సంజయ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం సంజయ్ తమిళ రాష్ట్రానికి వారసుడు. అతని స్థాయిని అందుకునే వారసుడు మరొకరు లేరు. సంజయ్ కోరుకుంటే ఏదైనా క్షణాల్లో జరిగిపోతుంది. అతను కోరుకుంటే దేశం లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్, బిగ్గెస్ట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లో సంజయ్ హీరో గా మొదటి సినిమా రెడీ అయిపోతుంది. కానీ అతని నాకు ఇలాంటివేమీ వద్దు అనుకున్నాడు’.
Also Read: రామ్ చరణ్ ని మ్యాచ్ చేయలేకపోయిన జానీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో!
‘దర్శకత్వం వైపే ఆసక్తి చూపించాడు. నేను ఒక సినిమాకు దర్శకత్వం వహించాలి, అందులో హీరోగా సందీప్ కిషనే కావలి అని కోరుకున్నాడు. ప్రతీ రోజు నేను సెట్ లో అతని వర్క్, డెడికేషన్ ని దగ్గరుండి చూస్తాను. ఇప్పుడు నేను అతనితో చేస్తున్న సినిమాని విజయ్ ఫ్యాన్స్ అందరూ చూస్తారా లేదా అనేది తర్వాత, కానీ ఒక 24 ఏళ్ళ వయస్సు ఒక కుర్రాడిలో ఇంతటి ప్రతిభ ని నేనెప్పుడూ చూడలేదు. ఇలాంటి వ్యక్తిని నేను ఇంతకు ముందు జీవితంలో ఎప్పుడూ కలవలేదు కూడా. అతనికి వెయ్యి కోట్ల రూపాయిలను రాబట్టగలిగేంత సత్తా ఉన్న సినిమాలో హీరో గా చేసే అవకాశం కూడా ఉంది. కానీ అవన్నీ కాదని దర్శకత్వం వైపు వచ్చాడు చూడు, అదే తనలో నాకు నచ్చింది. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతనితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను’ అంటూ సందీప్ కిషన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.