Homeహెల్త్‌Mobile Overuse Health Effects: మొబైల్ ను ఈ విధంగా ఎక్కువసేపు చూస్తే నరాలపై ఒత్తిడి.....

Mobile Overuse Health Effects: మొబైల్ ను ఈ విధంగా ఎక్కువసేపు చూస్తే నరాలపై ఒత్తిడి.. వెన్నెముక పై ప్రభావం.. మరి ఏం చేయాలంటే?

Mobile Overuse Health Effects: ప్రస్తుత కాలంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చేతిలో మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. కొందరు సరదా కోసం ఫోన్ చూస్తే.. మరికొందరు తమ అవసరాల నిమిత్తం ఫోన్ పైనే గంటల తరబడి ఉంటున్నారు. అయితే ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే చాలామంది వైద్యులు హెచ్చరించారు. కానీ ఫోన్ చూసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మనిషి వెన్నెముకపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఒక శరీరానికి వెన్నెముకే ప్రధానంగా ఉంటుంది. అలాంటి వెన్నెముకపై ఈ ఫోన్ ప్రభావం ఎలా పడుతుందో ఇప్పుడు చూడండి..

సోషల్ మీడియా.. ఇతర కారణాలవల్ల గంటల తరబడి మొబైల్ చూసేందుకు చాలామంది మెడను కొన్ని డిగ్రీల పాటు వంచుతూ ఉంటారు. సాధారణంగా తలా బరువు 5 కిలోల వరకు ఉంటుంది. ఈ హెడ్ వెయిట్ వెన్నెముకపై పడడం వల్ల సమస్యలు వస్తాయి. తల నిటారుగా ఉండటం వల్ల వెన్నెముకపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే మొబైల్ చూసేందుకు తల 15 డిగ్రీల వరకు వంచితే వెన్నెముకపై 12 కిలోల బరువు పడుతుంది. 30 డిగ్రీల వరకు మెడ వంచితే 18 కిలోల బరువు వెన్నెముకపై పడుతుంది. అలాగే 45 డిగ్రీల వరకు మెడను వంచితే 22 కిలోలు.. 60 డిగ్రీల వరకు మెడను వంచి మొబైల్ చూస్తే వెన్నెముకపై 27 కిలోల ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఎప్పటికీ అలాగే ఉంటే మెడ కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది.

ఇలా ప్రతిరోజు ఉండడంవల్ల మెడ నొప్పితో పాటు భుజాల్లో పెయింట్స్ వస్తూ ఉంటాయి. అలాగే వెన్నునొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆ తర్వాత క్రమంగా తలనొప్పి, చేతుల్లో మొద్దు మారడం.. నరాలపై ఒత్తిడి పెరగడం.. నిద్రలేమి వంటి సమస్యలు కూడా రావచ్చు. ఎక్కువసేపు ఈ విధంగా కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులపై కూడా ప్రభావం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ భంగిమ వల్ల రక్తప్రసరణ పై కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అందువల్ల మొబైల్ చూసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. గంటల తరబడి మొబైల్ చూసేవారు కనీసం 20 నిమిషాలకు ఒకసారి మెడను నేరుగా ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. లేదా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఎక్కువసేపు ఒకే బంగిమలో కూర్చోకుండా మెడను అటు ఇటు తిప్పుతూ ఉండటం వల్ల వెన్నెముకపై ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా పిల్లలు, యువ తమకు తెలియకుండానే గంటల తరబడి మొబైల్ చూస్తూ ఉంటారు. ఇలాంటివారు ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల భవిష్యత్తులో వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version