Janasena Pawankalyan:ఏపీలో రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల మొదటి వారంలో తుళ్లూరులో ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం నెళ్లూరు జిల్లాలో కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులను ప్రకటించిన తరువాత అమరావతి రైతులు తమ భూముల కోసం ఆందోళనకు దిగారు. అప్పటి నుంచి రకరకాలుగా నిరసనలు తెలిపారు. ఆ తరువాత పాదయాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ పాదయాత్రకు ఊరూరా స్పందన రావడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. ముందునుంచీ టీడీపీ వీరికి సపోర్టుగా ఉండగా.. బీజేపీ కొన్ని రోజుల కింద వీరి పాదయాత్రలో కలిసిపోయింది. తాజాగా జనసేన కూడా రైతుల పాదయాత్రకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఈ పాదయాత్రకు జనసేన అధ్యక్షుడు వచ్చేది అనుమానమే అని అంటున్నారు.
రైతుల పాదయాత్రలో జనసేన పార్టీ పాల్గొంటుందని బుధవారం పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి నాదెండ్ల మనోహర్ పేరిట విడులయిన ప్రకటనతో జనసేన నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. ఇంతకాలం అమరావతి రైతుల పాదయాత్రకే ఒక్క టీడీపీనే క్యాష్ చేసుకుంటుందని భావించారు. ఆ తరువాత బీజేపీ జాయిన్ అయినా మిత్రపక్షమైన జనసేనకు ఆహ్వానం పంపలేదు. దీంతో ముందు ముందు వారి నుంచి పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయోనని జనసైనికులు ఆందోళన చెందారు. కానీ బుధవారం ప్రకటనతో కాస్త హ్యాపీ అయ్యారు.
Also Read: 26 నుంచి అమరావతి రైతులతో జనసేన యాత్ర..
అయితే రైతుల పాదయాత్రలో పవన్ పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఇందులో నాదెండ్ల మనోహన్ ఆధ్వర్యంలో జనసైనికులు కలిసే అవకాశం ఉంది. అమరావతి రైతులకు మొదటి నుంచి పవన్ మద్దతు ఇస్తూ వస్తున్నారు. వారు ధర్నా నిర్వహిస్తున్న శిబిరానికి వెళ్లి పలకరించారు. అయితే ఇప్పుడు పాదయాత్రలో పాల్గొనకపోవడంపై రకరకాలు గా చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ, బీజేపీ నుంచి కూడా అధినేతలు కాకుండా ఇతర నాయకులు వెళ్లి వారితో పాదయాత్ర చేశారు. ఇప్పుడు జనసేన కూడా వారి బాటలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది.
మూడురాజధానులకు పవన్ మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్ర మొదలు పెట్టి 20 రోజులవుతుంది. అయితే ఇటీవల ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇక రైతులకు మద్దతిచ్చే పార్టీల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు వీరికి మద్దతు పలుకుతున్నాయి. అయితే జనసేన ఇదివరకే సపోర్టు ఇచ్చి పవన్ నేరుగా పాల్గొని ఉంటే బాగుండేదని అంటున్నారు.
Also Read: ప్రకృతి వైపరీత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే! వరద బాధితుల వద్దకు పవన్