https://oktelugu.com/

తేజ్ కొత్త నిర్ణయం.. ఫ్యాన్స్ కి రిలీఫ్ అదే !

మెగా మేనల్లుడు ‘సాయి ధరమ్ తేజ్’ ప్రస్తతం డల్ ఫేజ్ నుండి హిట్ ట్రాక్ ఎక్కి సినిమా సినిమాకి మార్కెట్ ను పెచుకుంటూ పోతున్నాడు. అయితే రెగ్యులర్ యాక్టింగ్ చేస్తున్నాడు, కొత్తగా తేజ్ చేస్తోంది ఏమి లేదు అంటూ తేజ్ పై కొన్ని కామెంట్స్ ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. అవి తాజాగా తేజ్ చెవిలో కూడా పడ్డాయట. అందుకే ఆ కామెంట్స్ ను సీరియస్ తీసుకుని.. ఇక నుండి చేయబోయే ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకత […]

Written By:
  • admin
  • , Updated On : April 14, 2021 / 04:47 PM IST
    Follow us on


    మెగా మేనల్లుడు ‘సాయి ధరమ్ తేజ్’ ప్రస్తతం డల్ ఫేజ్ నుండి హిట్ ట్రాక్ ఎక్కి సినిమా సినిమాకి మార్కెట్ ను పెచుకుంటూ పోతున్నాడు. అయితే రెగ్యులర్ యాక్టింగ్ చేస్తున్నాడు, కొత్తగా తేజ్ చేస్తోంది ఏమి లేదు అంటూ తేజ్ పై కొన్ని కామెంట్స్ ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. అవి తాజాగా తేజ్ చెవిలో కూడా పడ్డాయట. అందుకే ఆ కామెంట్స్ ను సీరియస్ తీసుకుని.. ఇక నుండి చేయబోయే ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని తేజ్ నిర్ణయించుకున్నాడట.

    ఆరు సినిమాల అట్టర్ ప్లాప్ లతో పూర్తిగా పడిపోయిన తనను.. మళ్ళీ ఆదరించిన ప్రేక్షుకుల కోసం అలాగే మెగా అభిమానుల కోసం తేజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే తేజ్ స్వతహాగా మంచి డ్యాన్సర్ కాబట్టి.. ఇక నుండి డ్యాన్స్ లో ప్రత్యేకత చూపించాలనుకుంటున్నాడు. నిజానికి గత కొన్ని చిత్రాలుగా తనలోని డ్యాన్సర్ ను బయటకు తీసే అవసరం ఎప్పుడూ తనకు రాలేదు అని, అయితే ప్రస్తుతం చేస్తోన్న రిపబ్లిక్ సినిమాలో ఒక సాంగ్ లో డ్యాన్స్ చేయడానికి మంచి అవకాశం దొరికిందట.

    కాగా ఆ సాంగ్ లో ఒక డ్యాన్స్ మూవ్మెంట్ హైలైట్ గా అయ్యేలా చూసుకుంటున్నాడు తేజ్. చాల కష్టమైనా స్టెప్ ను కంపోజ్ చేయమని.. జానీ మాస్టర్ కి కూడా ఇప్పటికే చెప్పాడట. మాస్ సాంగ్ కాబట్టి.. మంచి డ్యాన్స్ మూవ్మెంట్స్ కు మంచి స్కోప్ కూడా దొరుకుతుంది కాబట్టి, తేజ్ నుండి అదిరిపోయే డ్యాన్స్ ను ఆశించొచ్చు. ఇప్పటికే జానీ మాస్టర్ ఈ సాంగ్ కోసం ఎక్కడా ఆగకుండా 55 సెకెన్ల పాటు సాగే ఒక స్టెప్ కంపోజ్ చేశాడట.

    ఈ స్టెప్ ఈ మధ్య వచ్చిన అన్ని స్టెప్స్ కంటే కూడా చాల కష్టమైనది అని.. మొత్తానికి క్రేజీ స్టెప్స్ లో ఈ స్టెప్ కూడా ప్రధాన హైలైట్ నిలుస్తుందని తెలుస్తోంది. ఎలాగూ దర్శకుడు దేవకట్టా కాబట్టి, సినిమా అంతటా విలువలే ఉంటాయి, వినోదానికి పెద్దగా స్కోప్ కూడా ఉండదు. కనీసం తేజ్ డ్యాన్స్ అయినా మెగా ఫ్యాన్స్ కి మంచి రిలీఫ్ ఇస్తోందేమో చూడాలి.