https://oktelugu.com/

షారుఖ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడట !

బాలీవుడ్‌ స్టార్స్ కే షారుక్‌ ఖాన్‌ బాద్షా. మరి అలాంటి హీరో కూతుర్ని నెల లక్ష రూపాయిలు సంపాదించే వాడికి ఇస్తాడా ? కానీ, ఓ నెటిజన్ నెలకు లక్ష సంపాదిస్తున్నా మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి అంటూ మొత్తానికి మొహమాటం లేకుండా ఒక ప్రపోజల్ పెట్టాడు. పైగా ‘షారుక్ – గౌరీ ఖాన్‌’ల ముద్దుల తనకు సుహానా ఖాన్‌ కి నిన్నతోటి (మే 25న) 21వ వడిలోకి అడుగు పెట్టడంతో పాపకి పెళ్లి ఈడు […]

Written By:
  • admin
  • , Updated On : May 26, 2021 / 12:42 PM IST
    Follow us on


    బాలీవుడ్‌ స్టార్స్ కే షారుక్‌ ఖాన్‌ బాద్షా. మరి అలాంటి హీరో కూతుర్ని నెల లక్ష రూపాయిలు సంపాదించే వాడికి ఇస్తాడా ? కానీ, ఓ నెటిజన్ నెలకు లక్ష సంపాదిస్తున్నా మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి అంటూ మొత్తానికి మొహమాటం లేకుండా ఒక ప్రపోజల్ పెట్టాడు. పైగా ‘షారుక్ – గౌరీ ఖాన్‌’ల ముద్దుల తనకు సుహానా ఖాన్‌ కి నిన్నతోటి (మే 25న) 21వ వడిలోకి అడుగు పెట్టడంతో పాపకి పెళ్లి ఈడు వచ్చినట్టే.

    అయితే కూతురు పుట్టినరోజు సందర్భంగా ‘గౌరీ ఖాన్‌’ తన కూతురి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రత్యేక విషెస్‌ చెప్పింది. ఫోటోతో పాటు ‘నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అంటూ చిన్న ఎమోషనల్ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. దాంతో సుహానా బర్త్‌ డే అని నెటిజన్లకు తెలిసింది. దాంతో వేలమంది నెటిజన్లు షారుక్ ముద్దుల తనయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడ్డారు.

    అయితే అందరిలా తాను కూడా విషెష్ చెబితే ఏమి బాగుంటుంది అనుకున్నాడో లేక నిజంగానే అమాయకంగా అడిగాడో తెలియదు గానీ, ఓ అభిమాని మాత్రం ఏకంగా పెళ్లి ప్రపోజల్‌ చేసి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ‘గౌరీ మేడమ్‌.. నేను నెలకు లక్ష రూపాయలకు పైనే సంపాదిస్తాను. నాకు సుహానాను ఇచ్చి పెళ్లి చేయండి’ అంటూ చేతులెత్తి వేడుకుంటున్న ఎమోజీని కూడా చేశాడు

    కాకపోతే ఇతగాడి ప్రపోజల్‌ ను గౌరీ పట్టించుకోలేదు అనుకోండి. కానీ నెటిజన్లు మాత్రం ఇతగాడి పై సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు సంపాదించే లక్ష రూపాయలు వారికి ఏ మూలకూ సరిపోవురా బాబు’ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అసలుకే సుహానా ఖాన్‌ న్యూయార్క్‌ లో స్టడీస్ పూర్తి చేసి వచ్చింది. సెకండ్‌ లాక్‌ డౌన్‌ విధించగానే గౌరీ ఖాన్‌ కూతురి దగ్గరకు వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉంది.