Manchu Vishnu Sensational comments on Ajith: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప(Kannappa Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం గురించి మంచు విష్ణు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో ఆయన తనకు బాలీవుడ్ లో మంచి ఆఫర్ వచ్చిందని, త్వరలోనే చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. గతంలో కూడా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూ లో తన సినిమాలకు బాలీవుడ్ లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చేవని , తద్వారా బాలీవుడ్ లో నాకు మంచి క్రేజ్ ఉందని, దానిని త్వరలోనే క్యాష్ చేసుకుంటానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో విడుదల చేశారు. రెస్పాన్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చింది.
అయితే ఈ ఇంటర్వ్యూ లో తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ‘నాకు ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ నాకు సరిపడా బలమైన క్యారెక్టర్స్ అనిపించకపోవడంతో వాటిని రిజెక్ట్ చేసాను. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే బలమైన క్యారక్టర్ తోనే ఇవ్వాలని అనుకున్నాను. అది త్వరలోనే నెరవేరబోతోంది. బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గర అవ్వాలి కదా అని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక అగ్ర కథానాయుడిగా, గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా అభిమానులు ఇబ్బంది పడే పాత్రలు చేయను. తమిళ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) దేశం లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు. ఆయన షారుఖ్ ఖాన్(Sharukh Khan) హీరో గా నటించిన అశోక లో చాలా చిన్న క్యారక్టర్ చేసాడు. ఒక అజిత్ అభిమాని గా ఆ పాత్ర చేసినందుకు నేను చాలా బాధపడ్డాను. ఇదే విషయాన్ని అజిత్ గారిని కలిసినప్పుడు చెప్పాను, ఆయన నవ్వి సైలెంట్ అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.
ఇక కన్నప్ప కలెక్షన్స్ విషయానికి వస్తే, ప్రస్తుతానికి ఈ చిత్రం 5 రోజుల్లో 44 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి దగ్గరగా ఉన్నది. ఈ వీకెండ్ తో కచ్చితంగా 50 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా ఈ చిత్రం థియేటర్స్ లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోవాలి. కానీ అది అసాధ్యం అని తెలుస్తుంది. మంచు విష్ణు తాను పెట్టిన బడ్జెట్ రీకవర్ అవ్వాలంటే కచ్చితంగా నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవాల్సిందే. రీసెంట్ గానే హిందీ శాటిలైట్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడుపోయింది అంటున్నారు. మరి ఓటీటీ రైట్స్ ఇంతకు అమ్ముడుపోతుందో చూడాలి.