https://oktelugu.com/

కేంద్రంపై ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ పిటిషన్..

కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియా దిగ్గజాలు న్యాయపోరాటానికి దిగనున్నాయి. బుధవారం నుంచి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తుండడంతో భారత్లో వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా నిర్వహణకు ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. అయితే కేంద్రంపై వీరు హైకోర్టులో పిటిషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరనున్నాయి. దీంతో ఎవరి వాదన నెగ్గుతుందోనని సోషల్ మీడియాను వాడేవారు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంనది, ఇందులో గోప్యత […]

Written By:
  • NARESH
  • , Updated On : May 26, 2021 / 12:35 PM IST
    Follow us on

    కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియా దిగ్గజాలు న్యాయపోరాటానికి దిగనున్నాయి. బుధవారం నుంచి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తుండడంతో భారత్లో వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా నిర్వహణకు ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. అయితే కేంద్రంపై వీరు హైకోర్టులో పిటిషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరనున్నాయి. దీంతో ఎవరి వాదన నెగ్గుతుందోనని సోషల్ మీడియాను వాడేవారు ఎదురుచూస్తున్నారు.

    సోషల్ మీడియాపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంనది, ఇందులో గోప్యత హక్కులు కాలరాసేలా ఉందని వాట్సాప్ వేసిన పిటిషన్లో పేర్కొంది. వాట్సాప్లో పోస్టు పెట్టిన వారి డిటేయిల్స్ ఇవ్వాలని కోరడం వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుందని పేర్కొంది. అయితే నేరగాళ్ల జాబితా ఇవ్వాలని కోరుతున్నా ప్రతీ మెసేజ్ కు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఇస్తున్నామని తెలిపింది. అయితే దానిని రద్దు చేయడం కుదరని వాట్సాప్ తెలిపింది.

    అయితే వాట్సాప్ తాజాగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ ఇవ్వడంతో పోరు తీవ్రమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ట్విట్టర్ కార్యాలయాల్లో ఈ వారం తనిఖీలు తీవ్రమయ్యాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బీజేపీ అధికార ప్రతినిధి,మరి కొందరు పోస్టులను ‘మ్యానుప్యులేటెడ్ మీడియా’ ను కలిగి ఉండడంతో ఈ వివాదం కోర్టుల వరకు వెళ్లింది.