Father Daughter Bonding: మగవాళ్లకు ప్రేమ తెలియదు. వాత్సల్యం తెలియదు. కఠినంగా ఉంటారు. రాటు తేలిన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుంటారని అందరూ అనుకుంటారు. కానీ మగవాళ్ళు అలా ఉండరు. మగవాళ్ళు ప్రేమించడం మొదలుపెడితే ప్రాణం ఇచ్చేస్తారు. వాత్సల్యాన్ని చూపించడం మొదలుపెడితే జీవితాంతం అలానే ఉంటారు.. మగవాళ్లది రాతి గుండె కావచ్చు. కానీ దాని వెనుక కూడా అద్భుతమైన ప్రేమ ఉంటుంది. ఊహకు అందని వాత్సల్యం ఉంటుంది.
ఓ మగవాడి దగ్గర.. ముఖ్యంగా తండ్రి దగ్గర కూతురు ఉంటే అతడు చిన్నపిల్లాడైపోతాడు. ఆమె లాలనలో ఆనంద పరశుడైపోతాడు. ఆమె చిట్టి పొట్టి మాటలు వింటూ స్వర్గంలో విహరిస్తాడు. ఆడపిల్లలో మరో తల్లిని చూసుకుంటాడు. ఆమెను “అమ్మా అమ్మా” అని పిలుస్తూ తన్మయత్వం చెందుతుంటాడు.. ఇంట్లో సందడి చేస్తుంటే గుండెల నిండా సంతోషాన్ని నింపుకుంటాడు. ఆమె సాంగత్యంలో లోకాన్ని మర్చిపోయి.. అసలు ఇంటిని కూడా మర్చిపోయి ఆనందంలో విహరిస్తూ ఉంటాడు. ఇంతటి ప్రేమ, ఇంతటి సాంగత్యం, ఇంతటి వాత్సల్యం ఉంటుంది కాబట్టే ఆడపిల్లను తండ్రి అత్యంత జాగ్రత్తగా చూసుకుంటాడు.
సోషల్ మీడియాలో వైరల్
సోషల్ మీడియాలో అనేక వీడియోలు కనిపిస్తున్న నేటి రోజుల్లో..ఓ వీడియో తండ్రికి కూతురికి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించింది.. ఓ తండ్రి ఇంట్లో ఉండగా.. అతని కూతురు చేసిన సందడి పండగ వాతావరణం తీసుకొచ్చింది. తండ్రి, కూతురి మధ్య జరిగిన సంభాషణ అద్భుతంగా ఉంది. “ముద్దు ఇవ్వనా నాన్న” అని ఆ కూతురు అడిగితే.. తండ్రి కూడా “ఇవ్వు నాన్నా” ఆమెను అన్నాడు. ఆ తర్వాత తన తండ్రికి ముద్దు ఇవ్వడానికి ఆ కూతురు చాలాసేపు ఆలోచించింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చాలా సంతోషకరమైన సంభాషణ జరిగింది. ఆ కూతురు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే.. తండ్రి కూడా అలానే సంభాషించాడు. వీరిద్దరి మధ్య చాలా సేపు వివిధ విషయాలపై సంభాషణ జరిగింది. ఆ విషయాలు చెప్పుకునే పెద్దవి కాదు. అలాగని చిన్నవి కూడా కాదు. ఒక తండ్రికి, ఒక కూతురుకి మధ్య ఇలాంటి సంభాషణలే ప్రేమను మరింత బలోపేతం చేస్తాయి. బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి.
ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సరదనే వేరు ❤️ pic.twitter.com/yeNoi6SNC0
— XstarAkhil (@ThorofTrends) June 24, 2025
చాలామంది తండ్రులకు కొడుకుల మీద ఇష్టం ఉన్నప్పటికీ.. కూతుర్ల మీద అమితమైన ప్రేమ ఉంటుంది. తండ్రులకు తమ కూతుర్లలో మరో అమ్మ కనిపిస్తుంది. అందుకే కూతుర్లను తండ్రులు అత్యంత ప్రేమగా చూసుకుంటారు. అమితమైన వాత్సల్యాన్ని ప్రదర్శిస్తారు. వారి కంటిలో కన్నీరు చూసినా చలించిపోతారు.. వారి పాదానికి ముళ్ళు గుచ్చుకున్నా గుండె పగిలిపోతారు. అందువల్లే కూతుర్లకు సంబంధించిన ఏ వేడుకలయినా సరే గొప్పగా జరుపుతారు. తమ స్తోమతకు మించి ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. కట్న కానుకలను తమ స్థాయికి మించి ఇచ్చి కూతుర్లు సుఖంగా ఉండాలని భావిస్తుంటారు. కూతుర్ల విషయంలో తండ్రి ప్రేమకు కొలమానం ఉండదు.. ఆ ప్రేమకు కొలమానం కట్టే సాహసం కూడా ఎవరూ చేయరు. చేసే అవకాశం కూడా లేదు.