https://oktelugu.com/

Karthika Deepam: మోనిత కొడుకు కోసం శాంతి పూజకి సిద్ధమైన సౌందర్య.. విషయం తెలిసి షాక్ అయిన దీప..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక మోనిత కొడుకు మెడకు పేగు వేసుకుని పుట్టాడని అలా పుట్టడంతో తండ్రికి మేనమామకు గండం ఉంటుందని ప్రియమణి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న సౌందర్య శాంతి పూజ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పంతులు గారిని అడిగి శాంతి పూజకు కావలసిన ఏర్పాట్లు చేయాలని బయలుదేరుతుంది. అలా బయలుదేరుతూ దీప గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. దీపకు చాలా అన్యాయం చేస్తున్నాను అయినా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 2, 2021 / 10:57 AM IST
    Follow us on

    బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక మోనిత కొడుకు మెడకు పేగు వేసుకుని పుట్టాడని అలా పుట్టడంతో తండ్రికి మేనమామకు గండం ఉంటుందని ప్రియమణి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న సౌందర్య శాంతి పూజ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పంతులు గారిని అడిగి శాంతి పూజకు కావలసిన ఏర్పాట్లు చేయాలని బయలుదేరుతుంది. అలా బయలుదేరుతూ దీప గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. దీపకు చాలా అన్యాయం చేస్తున్నాను అయినా ఈ పూజలు చేస్తుంది కార్తీక్ కోసమే కార్తీక్ బాగుంటే దీప బాగుంటుంది అని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది.

    పంతులు దగ్గరకు వెళ్ళిన సౌందర్య పుట్టిన బిడ్డ గురించి చెబుతూ బిడ్డ తండ్రి పేరు కార్తీక్ అని రాయించి శాంతి పూజకు కావలసిన వస్తువులన్నింటిని ఒక పేపర్లో రాసి ఇస్తాడు. అయితే ఈ పూజ చేయడానికి తప్పకుండా తల్లి తండ్రి బిడ్డ ఉండాలి అని పంతులు చెప్పడంతో సౌందర్య ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు ఆ మోనితను ఎలా తీసుకురావాలి అంటూ గతంలో తాను అన్న మాటలు గుర్తు చేసుకొని మదన పడుతుంది. ఈ సమయంలోనే దీప గురించి ఆలోచిస్తూ ఎక్కడికెళ్ళావ్ దీప అంటూ బాధపడుతుంది. అయితే ల్యాబ్ నుంచి దీప ఆలోచనలతో రోడ్డుపై నడుస్తూ సౌందర్య కారుకు ఎదురు పడుతుంది.

    రోడ్డుపై దీప రావడం చూసిన సౌందర్య తనని కారులోకి ఎక్కించుకుని ఎక్కడికి వెళ్లావు ఏం చేస్తున్నావు వంటి ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతుంది. సౌందర్య అడిగిన ప్రశ్నలకు దీప వెటకారంగా సమాధానం చెప్పడంతో సౌందర్యకు అనుమానం వస్తుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి మోనిత పదేపదే కార్తీక్ కి ఫోన్ చేస్తూ విసిగిస్తుంది. మోనిత ఫోన్ కట్ చేస్తూ కార్తిక్ దీప గురించి ఆలోచిస్తూ బాధపడతాడు.ఇక భారతి మోనిత దగ్గరకు వచ్చి మోనిత ఇల్లు కాళీ చేస్తున్నావట ఎందుకు అని అడగడంతో అందుకు సమాధానం త్వరలోనే చెబుతాను అంటూ దాటివేస్తుంది.

    ఇక మోనిత ఫోన్ చేయడంతో విసుగు చెందిన కార్తీక్ వెంటనే సౌందర్యకు ఫోన్ చేసాడు. కారులో సౌందర్య ఫోన్ రింగ్ అవడంతో దీప ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది.అయితే ఫోన్ తో పాటు పంతులు గారు ఇచ్చిన స్లీప్ ఉండడంతో ఆ స్లిప్ దీపా ఎక్కడ చూస్తుందో అని సౌందర్య కంగారు పడుతుంది. అయితే సౌందర్య ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో దీప ఫోన్ తీసి సౌందర్యకు ఇవ్వగా సౌందర్య కారు బయటకు వెళ్లి మాట్లాడటంతో దీప ఏదో జరుగుతుంది అంటూ ఆలోచనలో పడుతుంది. ఈ క్రమంలోనే పంతులు గారు ఇచ్చిన స్లిప్ దీప కంటపడటంతో అది చూసిన దీప షాక్ అవుతూ ఎంతో బాధ పడుతుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.