Jai Bhim: జై భీమ్ సినిమా చూసి సీఎం స్టాలిన్ రెండు పేజీల లేఖ రాశారన్న… సూర్య

Jai Bhim: జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య, రాజీషా విజయన్‌ జంటగా నటించిన చిత్రం ‘జై భీమ్‌’. అలానే ప్రకాష్‌ రాజ్, రావు రమేష్, సంజయ్‌ స్వరూప్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్‌’ సినిమా అని హీరో సూర్య అన్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈరోజు నుంచి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 2, 2021 10:52 am
Follow us on

Jai Bhim: జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య, రాజీషా విజయన్‌ జంటగా నటించిన చిత్రం ‘జై భీమ్‌’. అలానే ప్రకాష్‌ రాజ్, రావు రమేష్, సంజయ్‌ స్వరూప్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్‌’ సినిమా అని హీరో సూర్య అన్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈరోజు నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రు 1993లో ఓ గిరిజన మహిళకు న్యాయం చేయడం కోసం ఆమె తరఫున ఓ న్యాయవాదిగా వాదించారు. ఆ కేసు ఆధారంగానే ‘జై భీమ్‌’ రూపొందించాం అని హీరో సూర్య తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌గారు మా సినిమా చూసి, అభినందిస్తూ రెండు పేజీల లేఖ రాశారు అని సూర్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మూవీ లో పని చేసిన రావు రమేశ్‌ సార్‌ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ‘జై భీమ్‌’ షూటింగ్‌ చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని… కోర్టు రూమ్‌ సన్నివేశాలు అందరికీ నచ్చుతాయని దీమ వ్యక్తం చేశారు సూర్య. ‘జై భీమ్‌’లో అవకాశం ఇచ్చిన జ్ఞానవేల్, సూర్యలకు థ్యాంక్స్‌ అని… చెన్నైలో ఉన్నప్పుడు తమిళ్‌ నేర్చుకున్నానని రావు రమేష్ చెప్పారు. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను అని వెల్లడించారు.