https://oktelugu.com/

బ‌ర్త్ డే స్పెష‌ల్ః ర‌ష్మిక ఓ తుఫాను!

సినిమా ఇండ‌స్ట్రీలోకి చినుకులా ప్ర‌వేశించి.. తుఫానులా విజృంభిస్తారు కొంద‌రు. అలాంటి వారిలో ముందు వ‌ర‌స‌లో ఉంటుంది ర‌ష్మిక మంద‌న్న‌. శాండ‌ల్ వుడ్ నుంచి బ‌య‌ట పాదం మోపిన ఈ సుంద‌రి.. టాలీవుడ్లో అన‌తికాలంలోనే టాప్ స్టార్ గామారిపోయింది. మాతృభాష క‌న్న‌డ క‌న్నా.. బ‌య‌టి సినిమాల ద్వారానే ర‌ష్మిక స్టార్ హీరోయిన్ స్టాట‌స్ అందుకోవ‌డం విశేషం. ఇవాళ ఈ బ్యూటీ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా.. ఈ భామ ప‌ర్స‌న‌ల్‌, కెరీర్ లైఫ్ చూద్దాం. 1996 ఏప్రిల్ 6న […]

Written By:
  • Rocky
  • , Updated On : April 5, 2021 / 01:28 PM IST
    Follow us on


    సినిమా ఇండ‌స్ట్రీలోకి చినుకులా ప్ర‌వేశించి.. తుఫానులా విజృంభిస్తారు కొంద‌రు. అలాంటి వారిలో ముందు వ‌ర‌స‌లో ఉంటుంది ర‌ష్మిక మంద‌న్న‌. శాండ‌ల్ వుడ్ నుంచి బ‌య‌ట పాదం మోపిన ఈ సుంద‌రి.. టాలీవుడ్లో అన‌తికాలంలోనే టాప్ స్టార్ గామారిపోయింది. మాతృభాష క‌న్న‌డ క‌న్నా.. బ‌య‌టి సినిమాల ద్వారానే ర‌ష్మిక స్టార్ హీరోయిన్ స్టాట‌స్ అందుకోవ‌డం విశేషం. ఇవాళ ఈ బ్యూటీ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా.. ఈ భామ ప‌ర్స‌న‌ల్‌, కెరీర్ లైఫ్ చూద్దాం.

    1996 ఏప్రిల్ 6న క‌ర్నాట‌క రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జ‌న్మించింది ర‌ష్మిక‌. త‌ల్లిదండ్రులుసుమ‌న్‌, మ‌ద‌న్ వంద‌న్న‌. ర‌ష్మిక విద్యాభ్యాసం మొత్తం కొడుగు జిల్లాలోనే జ‌రిగింది. ఎంఎస్. రామ‌య్య కాలేజీలో జ‌ర్న‌లిజం, సైకాల‌జీలో డిగ్రీ చ‌దివింది. సినిమాల్లోకి రాక‌ముందు ప‌లు ప్ర‌క‌ట‌నల్లో న‌టించి అంద‌రినీ ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత‌ 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఆఫ్ ఇండియా‘ టైటిల్ సొంతం చేసుకుంది.

    ఈ పోటీలో విజేత కావ‌డం ద్వారానే ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిలో ప‌డింది. 2016లో క‌న్న‌డ సిని‌మా కి‌ర్రిక్ పార్టీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇక‌, తెలుగులో వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య హీరోగా తెర‌కెక్కిన ‘ఛలో’ చిత్రం ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ త‌ర్వాత‌ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

    ఆ తర్వాత నాగార్జున‌-నాని దేవ‌దాస్ సినిమాలో, మ‌రోసారి విజ‌య‌దేవ‌ర‌కొండ తో డియ‌ర్ కామ్రేడ్ సినిమాల్లో న‌టించింది. గ‌తేడాది మ‌హేష్ బాబుతో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తో టాప్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత నితిన్ తో చేసిన భీష్మసినిమా కూడా హిట్ అందుకోవడంతో అమ్మడు నెంబర్ వన్ రేసులో నిలిచింది.

    రీసెంట్ గా సుల్తాన్ సినిమాతో కోలీవుడ్లోనూ ప్రవేశించింది. తెలుగులోనూ డబ్ అయిన ఈ మూవీతో అభిమానులను పలకరించింది. ఇక, బన్నీ సరసన చేస్తున్న పుష్పతో మరోసారి టాప్ సినిమాతో అభిమానులను అలరించనుంది.

    ఇక, అటు బాలీవుడ్ లోనూ ప్రవేశించిందీ బ్యూటీ. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్నూ’ చిత్రంలో నటిస్తోంది. ఇది పూర్తి కాకుండానే.. బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది.
    ‘గుడ్ బై’ అనే ఈ సినిమా ద్వారా.. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఈ రెండు సినిమాల‌లో ఏ ఒక్క‌టి హిట్ కొట్టినా.. బాలీవుడ్లో ర‌ష్మిక జెండా ఎగ‌రడం ఖాయంగా క‌నిపిస్తోంది.

    ఈ హ్యాపీ బ‌ర్త్ డే వేళ‌.. ర‌ష్మిక వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ ఆనందంగా ముందుకు సాగాల‌ని కోరుకుందాం. మనం కూడా బ్యూటీకి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ‘హ్యాపీ బ‌ర్త్ డే ర‌ష్మిక‌’.