https://oktelugu.com/

Big Boss 5 Telugu: బిగ్ బాస్ సిరి కోసం ఆమె లవర్ రాసిన లవ్ లెటర్ చూసారా అందులో ఏముందంటే ?

బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలోని నామినేషన్ ప్రక్రియ కొంత వరకు ఎమోషనల్ గా కొనసాగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ సభ్యులకు తమ కుటుంబం నుంచి లెటర్స్ పంపించారు.అయితే పవర్ రూమ్ లోకి ఇద్దరు సభ్యులను పంపించి వారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు లేఖలు ఇస్తారు. అయితే ఒకరు లేఖ కావాలనుకుంటే మరొకరు వదులుకోవాల్సి వస్తుంది. ఇలా లేఖను వదులుకున్న వారు నామినిట్ అయినట్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 27, 2021 / 10:50 AM IST
    Follow us on

    బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలోని నామినేషన్ ప్రక్రియ కొంత వరకు ఎమోషనల్ గా కొనసాగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ సభ్యులకు తమ కుటుంబం నుంచి లెటర్స్ పంపించారు.అయితే పవర్ రూమ్ లోకి ఇద్దరు సభ్యులను పంపించి వారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు లేఖలు ఇస్తారు. అయితే ఒకరు లేఖ కావాలనుకుంటే మరొకరు వదులుకోవాల్సి వస్తుంది. ఇలా లేఖను వదులుకున్న వారు నామినిట్ అయినట్లు లెక్క.

    ఈ క్రమంలోనే పవర్ రూమ్ లోకి వెళ్లిన షన్ను, రవికి సిరి విశ్వ లెటర్లు అందాయి. అయితే సిరి తనకు కొడుకు పుట్టకపోయినా నా కొడుకు ఉన్నాడు అని కానీ విశ్వా తన పిల్లలకోసం ఎంత తపన పడుతున్నాడో నేను అర్థం చేసుకోగలను అందుకే విశ్వకు లేఖ ఇచ్చి తన లేఖను ముక్కలు చేసింది. ఈ క్రమంలోనే సిరి తన ప్రియుడు నుంచి వచ్చిన లేఖను వదులుకోవడంతో కొంత వరకు ఎమోషనల్ అయ్యింది. అయితే తాజాగా తిరిగి తన ప్రియుడు శ్రీహన్ రాసిన లేఖ బయటపడటంతో ఈ లేఖ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    siri hanumanth

    హాయ్ సిరి పన్నెండేళ్ల రిలేషన్షిప్ లో ఎప్పుడు నువ్వు నాకు ఇన్ని రోజులు దూరంగా ఉండలేదు. మా అమ్మానాన్నల తర్వాత నా గురించి అంత ఆలోచిస్తూ కేరింగ్ తీసుకునే పర్సన్ నువ్వు. నీ నవ్వంటే నాకు ఎంతో ఇష్టం. కానీ నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను ఎప్పుడూ హ్యాపీగా ఉండు అంటూ చెప్పడమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుందాం అంటూ సిరి ప్రియుడు శ్రీహన్ తనకు లేఖ రాసినట్లు ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది.

    Also Read: ఎక్కువ రాబడి ఇచ్చే ఎల్ఐసీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇదే.. ఎక్కువ బెనిఫిట్స్ తో?