https://oktelugu.com/

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ రన్ టైమ్ విషయం లో అదే ఫైనల్ డిసిషన్ అంటున్న జక్కన్న…

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం).  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. భారీ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్… రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనువిందు చేయనున్నారు. వీరికి జంటగా ఒలివియా మోరీస్, ఆలియా భట్ హీరోయిన్లుగా […]

Written By: , Updated On : October 27, 2021 / 11:03 AM IST
Follow us on

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం).  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. భారీ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్… రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనువిందు చేయనున్నారు. వీరికి జంటగా ఒలివియా మోరీస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలానే  ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, సముద్ర ఖని, శ్రియ, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.

director rajamouli final decision about runtime of rrr movie

అయితే ఇప్పుడు రాజమౌళి సంక్రాంతి బరిలో దిగడంతో… మిగతా సినిమాల నిర్మాతలు, హీరోలు జక్కన్న తీసుకున్న డెసిషన్ పై ఒకింత ఆగ్రహాంగా ఉన్నారనే చెప్పాలి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.  ఈ సినిమా ఫైనల్‌గా 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని… జక్కన్న ఈ సినిమాను ట్రిమ్ చేసి చివరగా 2 గంటల 45 నిమిషాలకు అన్ని భాషల్లో ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ రన్ టైమ్ విషయం లో ఇంకా తగ్గేదెలే అని రాజమౌళి డిసైడ్ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో బాహుబలి చిత్రం కూడా ఎక్కువ రన్ టైమ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ లకు భారీ స్పందన లభిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లు ప్రారంభం కానున్నాయని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.