https://oktelugu.com/

గ్యాస్ సిలిండర్ వాడేవాళ్లకు అదిరిపోయే శుభవార్త..?

2021 సంవత్సరంలో అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. గ్యాస్ సిలిండర్ దేశ రాజధాని ఢిల్లీలో 809 రూపాయలుగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 900 రూపాయలకు అటూఇటుగా ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గితే బాగుంటుందని సామాన్య ప్రజలలో చాలామంది అభిప్రాయపడుతున్నారు. Also Read: తులసి మొక్కలతో లక్షలు సంపాదించవచ్చు.. ఎలా అంటే..? అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 6, 2021 1:05 pm
    Follow us on

    Gas Prices

    2021 సంవత్సరంలో అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. గ్యాస్ సిలిండర్ దేశ రాజధాని ఢిల్లీలో 809 రూపాయలుగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 900 రూపాయలకు అటూఇటుగా ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గితే బాగుంటుందని సామాన్య ప్రజలలో చాలామంది అభిప్రాయపడుతున్నారు.

    Also Read: తులసి మొక్కలతో లక్షలు సంపాదించవచ్చు.. ఎలా అంటే..?

    అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధరలు తగ్గుతాయని చేసిన ప్రకటనతో రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు కచ్చితంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారీగా ధరలు తగ్గడంతో దేశంలో కూడా మరికొన్ని రోజుల్లో ధరలు తగ్గనున్నాయని సమాచారం. ఈ నెలలో 10 రూపాయలు తగ్గగా 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు గ్యాస్ ధర దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    మరోవైపు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్యాస్ సిలిండర్ ధరలు 125 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే సమయంలో భారీగా పెరుగుతుంటే తగ్గే సమయంలో మాత్రం ఎక్కువగా తగ్గడం లేదు. మరోవైపు పేటీఎం, ఇతర డిజిటల్ పేమెంట్ సంస్థలు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ధరలు తగ్గితే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.

    Also Read: ఎస్బీఐ సూపర్ స్కీమ్.. రూ.100తో 10 లక్షలు..?

    మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే వాహనదారులకు ఉపశమనం కలుగుతుంది. లీటర్ పెట్రోల్ ధర 95 రూపాయలకు అటూఇటుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 90 రూపాయలకు అటూఇటుగా ఉన్న సంగతి తెలిసిందే.