
పవర్ స్టార్ అభిమానులు ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ స్పెషల్ షోల అప్ డేట్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న తమ హీరో సినిమాని, ముందుగానే స్పెషల్ షోలలో చూడటం పవన్ ఫ్యాన్స్ కి అలవాటు. అందుకే ఏప్రిల్ 8 అర్థరాత్రి బెనిఫిట్ షోస్ వేయాలని పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలను అలాగే పోలీసులను కూడా కోరుతున్నారు. మరోపక్క డిస్ట్రిబ్యూటర్లు కూడ తమ సినిమాకి ఉన్న డిమాండ్ దృష్ట్యా స్పెషల్ షోష్ కోసం పోలీసులను రిక్వెస్ట్ చేశారు. మరి ఇప్పుడున్న కరోనా విజృంభణ పరిస్థితుల్లో స్పెషల్ షోలకు అసలు అనుమతి దొరుకుతుందా అనే టెన్షన్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్ కోసం ఒక లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ బెనిఫిట్ షోలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. అయితే 9వ తేదీన అదనపు షోస్ వేసుకునే వెసులుబాటును మాత్రం పోలీసులు కల్పించారు. దాంతో మార్నింగ్ షోలకు ముందు ఉదయం 7 గంటలకు ఈ అదనపు షోస్ పడనున్నాయి. మొత్తానికి బెనిఫిట్ షోలు లేకపోయినా స్పెషల్ షోలు ఉండబోతున్నాయి అన్నమాట. కనీసం ఎర్లీ మార్నింగ్ షోస్ అయినా పడుతున్నాయి, అభిమానులకు ఆ రకంగా అయినా కాస్తంత సంతోషాన్ని కలిగిస్తోంది.
అయితే ఈ స్పెషల్ షోల వ్యవహారాన్ని అన్ని థియేటర్స్ కి అనుమతులు ఇస్తారా అన్నది డౌటే. కాకపోతే కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో మాత్రం స్పెషల్ షోలు వేసుకోవచ్చు. ఇకపోతే పవన్ రీఎంట్రీ సినిమా అయ్యేసరికి ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయిలో చాలా జోరుగా సాగుతున్నాయి. ఏది ఏమైనా పవర్ స్టార్ అభిమానులు పవన్ రీఎంట్రీ మూవీ రిలీజ్ ను ఒక పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను కూడా అంగరంగ వైభవంగా జరిపి, పవన్ రేంజ్ ఏమిటో చూపించారు.