https://oktelugu.com/

డిగ్రీ పాసైన వాళ్లకు శుభవార్త.. పరీక్ష లేకుండా జాబ్స్..?

ఏపీ పౌరసరపరాల శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 34 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 34 ఖాళీలలో 17 ఉద్యోగ ఖాళీలు పురుషులకు ఉండగా 17 ఉద్యోగ ఖాళీలు స్త్రీలకు ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక పురుష, స్త్రీ అభ్యర్థికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఒక జిల్లాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 5, 2021 / 08:17 PM IST
    Follow us on

    ఏపీ పౌరసరపరాల శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 34 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 34 ఖాళీలలో 17 ఉద్యోగ ఖాళీలు పురుషులకు ఉండగా 17 ఉద్యోగ ఖాళీలు స్త్రీలకు ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక పురుష, స్త్రీ అభ్యర్థికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఒక జిల్లాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎయిర్ ఫోర్స్ జాబ్స్..?

    షార్ట్ లిస్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండటంతో పాటు పదో తరగతిలో తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉండాలి. తెలుగు ఒక సబ్జెక్ట్ గా లేని వాళ్లు గుర్తింపు పొందిన సంస్థ నుంచి తెలుగులో సర్టిఫికెట్‌ కోర్సు చేసినా ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు.

    కన్జూమర్‌ అఫైర్స్‌, లా, పబ్లిక్‌ అఫైర్స్‌, అడ్మినిస్ట్రేషన్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, ఇండస్ట్రీ, ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌, ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, పబ్లిక్‌ హెల్త్‌ లేదా మెడిసిన్‌ విభాగాలలో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: తెలంగాణలో అంగన్‌వాడీ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

    ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ, వినియోగదారుల వ్యవహారాలు – ఆహారం – పౌర సరఫరాల శాఖ, ఐదో బ్లాక్‌, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియెట్‌, వెలగపూడి, అమరావతి అడ్రస్ కు పంపాలి. ఏప్రిల్ 12 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా http://civilsupplies.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.