Homeబిజినెస్White Car: వైట్ కలర్ కార్ కొంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

White Car: వైట్ కలర్ కార్ కొంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

White Car: తెలుపు రంగు ప్రశాంతతకి సంబంధించినది. చాలా మంది ఈ రంగుకి ఇష్టపడతారు. వేసుకునే దుస్తులు నుంచి కార్ల వరకు అన్ని కూడా వైట్ కలర్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ రంగు చూడటానికి బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రంగుకి ఇంట్రెస్ట్ చూపించకపోవడమే మంచిది. ఎందుకంటే వైట్ కలర్‌లో ఉన్న ఏ వస్తువు అయిన కూడా తొందరగా మురికి పడుతుంది. దీంతో ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. అయితే జీవితంలో కారు తీసుకోవాలని అందులో ప్రయాణించాలని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలో సెంటిమెంట్‌‌గా భావించి వైట్ కలర్‌లో ఉండే కారును తీసుకోవడానికి ఇష్టపడతారు. చూడటానికి వైట్ కలర్ కారు బానే ఉంటుంది. కానీ దీనివల్ల లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. మీరు వైట్ కలర్ కారు కొనాలనుకుంటే మాత్రం.. ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకున్న తర్వాతే కొనడం మంచిది. మరి వైట్ కలర్ కారు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం.

వైట్ కలర్ కారు చూడటానికి బాగుంటుంది. కానీ తొందరగా నల్లగా మారుతుంది. ఒక్కసారి రోడ్డు మీదకు వెళ్తే చాలు నల్లగా అవుతుంది. దీనివల్ల కారు అందం పోతుంది. అలాగే ఎక్కువ సార్లు కారును కడగవలసి వస్తుంది. వైట్ కలర్‌ను సెంటిమెంట్‌గా భావించి చాలా మంది వైట్ కలర్ కారును ఎక్కువగా కొంటారు. దీనివల్ల వైట్ కలర్ కార్లు ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తుంటాయి. దీనివల్ల మీ కారు యూనిక్‌గా అనిపించదు. అందరిలానే మీ కారు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, రెంట్‌కి తీసుకున్న వారు కూడా ఎక్కువగా వైట్ కలర్ కారును వాడుతుంటారు. కాబట్టి మీ కారు ఇందులోనే కలిసిపోతుంది. అదే వేరే రంగు కారు అయితే ఒక ఐడెంటిటీ ఉంటుంది. అలాగే కార్లకు ఎక్కువగా ఎండ పడితే తెలుపు రంగు కాస్త మారిపోతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా తెల్ల కారులు పొగమంచులో కనిపించవు. దీనివల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి.

సాధారణంగా కూడా లైటింగ్స్‌లో వైట్ కార్లు పెద్దగా కనిపించవు. వీటివల్ల ప్రాణ నష్టం ఏర్పడుతుంది. సెంటిమెంట్ ఉండటం ముఖ్యమే. అలాగే సేఫ్టీ కూడా చూసుకోవాలి. కేవలం మన ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎంత జాగ్రత్తగా వాడిన కూడా కొన్నిసార్లు వైట్ కలర్ కారు నల్లగా మారుతుంది. అందులోనూ వర్షా కాలం అయితే చెప్పక్కర్లేదు. వేరే రంగు కార్లు బురదలో వెళ్తేనే కారు మొత్తం ఇక నల్లగా అవుతుంది. అలాంటిది వైట్ కలర్ కారు కాస్త బురదతో మారుతుంది. అలాగే తెలుపు రంగు అయితే ఎక్కువ సార్లు కారు వాష్ చేయాలి. ఒకవేళ కారుకి పూర్తిగా సర్వీసింగ్ చేయించకపోతే రంగు కూడా పూర్తిగా మారిపోతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper