Gold Silver Prices Today: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తల కారణంగా ప్రపంచ ఆర్థిక మార్కెట్లో అస్థిరత నెలకొని అవకాశం ఉంది. భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తలు పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు Safe Heaven ఆస్తులుగా భావించే బంగారం, వెండివైపు మరలు తారు. ప్రస్తుతం కూడా అదే జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరిగే యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంటుంది. నీతో ప్రపంచ మార్కెట్లలో రిస్క్ పెరగనుంది. యుద్ధం విస్తరించే ప్రమాదం ఉండడంతో పాటు చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొననుంది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు తగ్గించి.. సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి వైపు మారడం సాధారణ పరిణామం.. అసలు ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతాయి?
Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?
అంతర్జాతీయంగా ఏర్పడిన ఆందోళన కారణంగా ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,71,000 లకు పైగానే పలుకుతోంది. వెండి ధర దాదాపు రూ.3 లక్షల చేరువలో ఉంది. అయితే ఇటీవల శాంతి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం ధరలు దిగి వచ్చాయి. వెండి ధరలు కూడా కుప్పకూలాయి. కానీ ఇప్పుడు మరోసారి ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నిలకడడంతో వీటి ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భౌగోళిక రాజకీయ సంక్షోభాల సమయంలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. యుద్ధ భయం కారణంగా స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు బయటకు వస్తాయి. డాలర్, బాండ్ మార్కెట్లలో ఆందోళన నెలకొంటుంది. చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయం పట్టుకుంటుంది. కేంద్ర బ్యాంకుల రిజర్వు డైవర్ఫికేషన్ జరుగుతుంది. దీంతో విలువ నిల్వ ఆస్తిగా బంగారం గా ఉంటుంది. అందుకే వీటిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు.
గ్లోబల్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో సోమవారం భారత మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడుదారులు షేర్ మార్కెట్లో విక్రయాలు చేయడం.. ఐటీ, బ్యాంకింగ్, ఆటో రంగంలో ఒత్తిడి పెరగడం.. చమురు దిగుమతులపై భారం ఏర్పడడం.. చివరికి రూపాయి బలహీనంగా మారడంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగి స్టాక్ మార్కెట్లలో నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు కొన్ని సూచనలు పాటించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిబంధనలు తెలుపుతున్నారు. అధిక రిస్క్ ట్రేడింగ్ జోలికి వెళ్లొద్దని, పోర్టు పోలియోతో కొంత బంగారం ఉంచాలని అంటున్నారు. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు విస్తరించకుండా నియంత్రణలోకి వస్తే మార్కెట్లు స్థిరపడే అవకాశం ఉందని అంటున్నారు.