Homeబిజినెస్Vivo V70 Features: Vivo V 70 మొబైల్ పై మహా క్రేజ్.. ఈ ఫీచర్లు...

Vivo V70 Features: Vivo V 70 మొబైల్ పై మహా క్రేజ్.. ఈ ఫీచర్లు ఉండడంతోనేనా…?

Vivo V70 Features: ప్రముఖ చైనా కంపెనీ Vivo మొబైల్స్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ కు మహా ఇష్టం. ఎందుకంటే ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు మెరుగైన కెమెరా పనితీరు ఉండే ఈ మొబైల్స్ బడ్జెట్లోనే అందుబాటులో ఉంటాయి. అయితే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన V70 మొబైల్ పై ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇందులో ఉండే కొన్ని ఫీచర్స్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్ పీపుల్స్ మొబైల్ కొనాలని అనుకుంటే దీని వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలా ఇష్టపడుతున్న ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Also Read: ఓరేయ్ అమీరూ.. తల ఎక్కడ పెట్టుకుంటావ్.. వీడి తిట్లే టీమిండియా కు దీవెనలు

Vivo మొబైల్ అనగానే ఇందులో అద్భుతమైన కెమెరా పనితీరు ఉంటుందని చాలా మంది భావన. అందుకు అనుకున్నట్లుగానే V 70 అనే మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా అమర్చారు. ఇది IMX 882 టెలిఫోటోతో సెన్సార్ ఫోటోలను అందిస్తుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సెన్సార్ల కంటే ఇది ఎక్కువ కాంతితో ఏఐ తరహాలో ఫోటోలను అందిస్తుంది. ఇందులో ఉండే సెన్సార్ వల్ల కెమెరాలోకి సరైన కాంతి వెళ్లి ఎలాంటి వాతావరణం లోనైనా అద్భుతమైన ఫోటోలను అందించడానికి ఏర్పాటు చేశారు. ఎలాంటి వాతావరణంలో నైనా కాంతివంతమైన ఫోటోలను తీసుకోవచ్చు. అలాగే లాంగ్ షాట్ తీయాలనుకున్న కూడా 20 x జూమ్ చేసినా కూడా ఎలాంటి resolution తగ్గకుండా ఉంటుంది.

నేటితరం యూత్ ఎక్కువగా మొబైల్స్ లో గేమింగ్ కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి అనుగుణంగా V 70 మొబైల్ లో డిఫాల్ట్ గా ఛాంపియన్ గేమ్ ను అందిస్తారు. అలాగే ఇతర గేమ్స్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇందులో సమర్థవంతమైన స్టోరేజ్ ని ఉంచారు. అలాగే ఏఐ సామర్థ్యంతో కూడిన సాఫ్ట్వేర్ ఉండడంతో ఈ గేమ్స్ కు సపోర్ట్ గా ఉంటుంది. మీ మొబైల్లో Origin OS 6 సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. ఇది ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఇందులో ఉండే యాప్స్ కు సపోర్ట్ గా ఉంటుంది. కొన్ని ఫైల్స్ ను సీక్రెట్ గా ఉంచడానికి కూడా సెక్యూరిటీని అందిస్తుంది.

వివో v70 మొబైల్ లో UFS 4.1 స్టోరేజ్ ని కలిగి ఉంది. అలాగే అప్గ్రేడ్ చేసిన LPDDR 5x అనే మెమొరీని సెటప్ చేశారు. ఇది సాధారణ మొబైల్స్ కంటే 75% అధికంగా స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. దీంతో ఫోటోలు, వీడియోలతో పాటు కావాల్సిన ఫైల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే రోజంతా మొబైల్ వినియోగించినా కూడా ఎలాంటి వెయిట్ పడకుండా ఉంటుంది. ఇటీవల కొన్ని మొబైల్స్ కొనుగోలు చేస్తే అవి కొంతకాలం తర్వాత ఏదో ఒక కారణంతో పాడైపోయే అవకాశం ఉంటుంది. కానీ వివో v70 మొబైల్ మాత్రం అందుకు భిన్నం అని అంటున్నారు. ఇది స్పేస్ గ్రేడు 6 సిరీస్ అల్యూమినియం మిశ్రమంతో తయారయింది. దీంతో ఖచ్చితమైన మైక్రోమీటర్ కలిగి అన్ని సమయాల్లో ఫ్రేమ్ రక్షణగా ఉంటుంది.

సెక్యూరిటీ విషయంలో ఈ మొబైల్ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానింగ్ 2.0. ఆప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ లేటెస్ట్ టెక్నాలజీ తో ఫింగర్ ప్రింట్ ఖచ్చితమైన స్కానింగ్ ఇచ్చి మొబైల్ యజమానులకు భద్రతను ఇస్తుంది. అప్రయత్నంగా వేలిముద్రలు పడినా కూడా మొబైల్ ఓపెన్ కాకుండా.. సరైన సమయంలో మాత్రమే లాక్ ఓపెన్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular