Homeబిజినెస్Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo కంపెనీ కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యువతను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ఫోన్‌ జూలై 27న అఫీషియల్ గా రిలీజ్ అయింది. ఇందులో బ్యాటరీ కెపాసిటీ తో పాటు డిస్ ప్లే ఆకట్టుకునేవిధంగా ఉంది. ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో […]

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo కంపెనీ కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యువతను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ఫోన్‌ జూలై 27న అఫీషియల్ గా రిలీజ్ అయింది. ఇందులో బ్యాటరీ కెపాసిటీ తో పాటు డిస్ ప్లే ఆకట్టుకునేవిధంగా ఉంది. ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం..

భారత మార్కెట్లోకి వివో కంపెనీ నుంచి T5e అనే ఫోన్ వచ్చింది. ఇది ఒకే ఒక్క వేరియంట్‌లో లభించనుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్‌ప్లేతో ఉండనుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయడంతో బ్రైట్నెస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా IP 64 రేటింగ్ ను కలిగి ఉండడంతో దుమ్ము, ధూళి నుంచి రక్షణగా ఉంటుంది.

ఇందులో ఆక్టా కోర్ ప్రాసెసర్‌ ఉండడంతో పాటు అదనంగా 4 జీబీ ర్యామ్ ను ఉంచారు. మరో 4 జీబీ ర్యామ్ ను కూడా వర్చువల్ గా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. దీంతో మొత్తం 8 జీబీ వరకు వాడుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాప్ట్ వేర్ పై రన్ అవుతుంది. ఇందులో ఏఐ ట్రాన్స్‌లేట్, వివో డాక్‌మాస్టర్ వంటి ఫీచర్లు ఉండడంతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

నిత్యం మొబైల్ పై వర్క్ చేసేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో 5,500ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసేందుకు రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ బ్యాటరీ 4 సంవత్సరాల పాటు ఏ ఇబ్బంది లేకుండా కొనసాగుతుందని కంపెనీ చెబుతోంది. కెమెరా విభాగంలో వెనుకవైపు 13 మెగా పిక్సెల్ ప్రాథమిక కెమెరా ఉంచారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 ఎంపీ కెమెరాను అమర్చారు.

4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను కలిగిన ఈ ఫోన్ ధర రూ. రూ. 13,999 గా నిర్ణయించారు. ఇది ఏరో బ్లూ, షాడో గ్రే రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీనిని నేటి నుంచే వివో అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper