Homeబిజినెస్Toyota Highlander Electric 2027 Features: అమెరికన్ మార్కెట్ ను షేక్ చేయనున్న కొత్త కారు.....

Toyota Highlander Electric 2027 Features: అమెరికన్ మార్కెట్ ను షేక్ చేయనున్న కొత్త కారు.. ధర ఎంత అంటే?

Toyota Highlander Electric 2027 Features: అమెరికా ఆటోమోబైల్ మార్కెట్లో కొత్త లగ్జరీ కార్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే ఇవి నిర్మాణంతోపాటు పంపిణీ ఖర్చులు అధికంగా ఉండడంతో కార్ల ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా లగ్జరీ కార్లు కొంతమంది మాత్రమే కొనుగోలు చేస్తారు. మాస్ మార్కెట్లో వీటి అమ్మకాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో లగ్జరీకారులకు బదులు SUV కార్ల సంఖ్య పెరుగుతుంది. లగ్జరీ కార్లతో పోలిస్తే వీటి ఖర్చులు తక్కువగా ఉండడంతో ధర కూడా సామాన్యులకు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా కార్లు కొనాలని అనుకునేవారు SUV వేరియంట్లకు ఎక్కువగా ఓటేస్తున్నారు. 2027 నాటికి ఖరీదైన కార్లను బీట్ చేసే విధంగా జపాన్ కంపెనీకి చెందిన SUV అమెరికా మార్కెట్లోకి రాబోతుంది. ఈ కారు ఎలా ఉండబోతుంది అంటే?

అమెరికా ఆటోమోబైల్ మార్కెట్లో ప్రస్తుతం లగ్జరీ కార్ల విషయానికి వస్తే 2026 మార్చి నాటికి BMW, లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలో తమ కార్ల విక్రయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. లెక్సస్ హైబ్రిడ్ ఇంజన్ కార్ ద్వారా నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఆ తర్వాత ప్రజాదరణ పొందిన కార్లుగా BMW కొనసాగుతోంది. అయితే వీటి కంటే ఎక్కువగా SUV లు, కార్లు ఎక్కువగా ఎకరాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరం ప్రారంభంలో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి కార్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే గత పది సంవత్సరాలుగా టయోటా తన SUV కారుతో మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫీచర్స్ తో పాటు లగ్జరీ లుక్ వచ్చే విధంగా ఈ కార్ల డిజైన్ ఉండడంతో చాలామంది ఎస్ యు వి కార్లవైపు మల్లుతున్నారు. అంతేకాకుండా ఈ కార్లలో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, యుటిలేటీరియల్ ప్లాస్టిక్ వంటివి వాడడం వల్ల వినియోగదారులకు సౌకర్యవంతంగా మారుతున్నాయి

అయితే ఇప్పుడు 2027 సంవత్సరానికి టయోటా హై లాండర్ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. దీని బాహ్య డిజైన్తో పాటు ఇంటీరియర్ డిజైన్ కూడా స్పెషల్ గా ఉండబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, స్లిమ్, ఫుల్ వెడల్పు LED లైటింగ్ కొత్తగా కనిపిస్తుంది. వెహికిల్ డైమెన్షనల్ మార్పులు దాదాపు తక్కువగా ఉండే రూఫ్ లైన్, వెడల్పు రెండు అంగుళాల కంటే ఎక్కువగా ఉండి కనిపిస్తుంది. ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్, కొత్త వీల్ డిజైన్ చూడొచ్చు. 19 అంగుళాల అల్లరి వీల్స్ ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. ఈ కారు ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే 12.3 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, 14 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం టచ్ స్క్రీన్ డ్రైవర్లకు అనుగుణంగా ఉంటుంది. పాత మోడల్ హై లాండర్ తో పోలిస్తే ఈ కొత్త వెహికల్ 8.1 అంగుళాల పెరుగుదల కనిపించినట్టు తెలుస్తోంది. ఈ కారులో 77.0 kWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే 270 మైళ్ల వరకు మైలేజ్ అందిస్తుంది. దీనికి DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడంతో పది నిమిషాల్లోనే 80% వరకు చార్జింగ్ అవుతుంది. దీని అంచనా ధర 48,000 డాలర్లుగా చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular