Homeబిజినెస్Top selling SUV cars in February 2026: SUV కార్లపై మోజు.. 2026 ఫిబ్రవరి...

Top selling SUV cars in February 2026: SUV కార్లపై మోజు.. 2026 ఫిబ్రవరి నెలలో ఏ కారు ఎక్కువ అమ్మకాలు చేసుకుందంటే?

Top selling SUV cars in February 2026: ఇంటి అవసరాలతో పాటు కార్యాలయ అవసరాల కోసం comfotable గా ఉండేందుకు SUV కారును కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు SUV కార్ల అమ్మకాలు పెరిగినట్లు కొన్ని నివేదికలను బట్టి తెలుస్తోంది. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో SUV వేరియెంట్లలో వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. 2025 ఫిబ్రవరి కంటే ఈ ఏడాది 26.54% పెరుగుదల ఉన్నట్లు కనిపించింది. నెలవారి ప్రాతిపదికన చూసినా కూడా జనవరి కంటే ఫిబ్రవరిలో 1.56 శాతం అమ్మకాలు పెరిగాయి. అయితే ఫిబ్రవరి నెలలో అత్యధికంగా SUV అమ్మకాలు చేసిన కంపెనీ ఏది? టాప్ లెవల్ లో ఏ కారు ఉంది?

2026 ఫిబ్రవరి నెలలో మొత్తం 36,638 యూనిట్ల SUV అమ్మకాలు జరిగాయి. 2025 ఫిబ్రవరిలో 31 325 కార్లు సేల్స్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ఎస్ యు వి కార్లకు ఆదరణ పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధికంగా సేల్స్ చేసుకున్న కారు Mahindra Scorpio నిలిచింది. ఈ నెలలో ఈ కారు 14,665 యూనిట్లు సేల్స్ అయింది. ఈ కారు గత ఏడాది ఇదే నెలలో 13,618 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 7.69% వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇదే కంపెనీకి చెందిన మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ SUV కారు ఫిబ్రవరి నెలలో 3,539 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. ఎలక్ట్రిక్ ఎస్ యు విభాగంలో ఇది బెస్ట్ సెల్లింగ్ కార్ గా నిలిచింది.

మహీంద్రా తర్వాత TATA కంపెనీకి చెందిన కార్లు అత్యధిక విక్రయాలు జరుపుకుంటోంది. ఈ కంపెనీ కారు హారియర్ ఫిబ్రవరి నెలలో 3,096 యూనిట్ల సేల్స్ చేయగా.. 2025 ఫిబ్రవరిలో 1,376 కార్లను విక్రయించింది. ఆ తర్వాత టయోటా కంపెనీకి చెందిన ఫార్చునర్ 2026 ఫిబ్రవరిలో 3,076 యూనిట్ల సేల్స్ జరిగాయి. గత ఏడాది కంటే ఈ కారు ఇప్పుడు 6.95 వృద్ధిని సాధించింది. మహీంద్రా కంపెనీకి చెందిన మరో ఎలక్ట్రిక్ కారు XEV 9e 1,889 యూనిట్ల విక్రయాలు నమోదు చేసుకుంది. అయితే ఈ కారు గత ఏడాది కంటే ఇప్పుడు 14.33 శాతం తగ్గింపు అమ్మకాలను నమోదు చేసింది. వీటితోపాటు హుందాయి ఆల్కాజర్ 97 యూనిట్లు, స్కోడా కోడియాక్ 146 యూనిట్ల సేల్స్ అయ్యాయి.

SUV వేరియంట్ కార్లు గతంలో మాదిరిగా కాకుండా నేటి తరం వారికి ఆకట్టుకునే విధంగా డిజైన్తో పాటు ఇంజన్ పనితీరును మారుస్తున్నారు. దీంతో ఈ విభాగం కార్లు ఎక్కువగా సేల్స్ నమోదు చేసుకుంటున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper