Government scheme: ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఐదు ప్రభుత్వ పథకాలు మహిళలకు ఆర్థికంగా బలంగా చేస్తాయి. భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేసుకోవాలి అని భావించే మహిళలకు ఇవి బాగా ఉపయోగపడతాయి. తక్కువ పెట్టుబడి తోనే లక్షల రూపాయలు పొందవచ్చు. ప్రభుత్వం అందించే ఈ పథకాలలో మీ డబ్బు సేఫ్ గా ఉండడంతో పాటు మంచి వడ్డీ కూడా లభిస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వాలు మహిళలకు ఆర్థికంగా బలాన్ని చేకూర్చడం కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో మాజీ లాడ్లీ బహిన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ప్రతి నెల కూడా ఈ పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం 1500 రూపాయలు ఇస్తుంది. మహిళలను ఆర్థికంగా స్వతంత్రంగా తయారు చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. మహిళల వార్షిక ఆదాయం 2.5 లక్షల కన్నా తక్కువగా ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులు. మధ్యతరగతి మరియు పేద కుటుంబ మహిళలు ఈ పథకం ద్వారా మంచి లాభం పొందుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ 2015లో సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమానికి ఇది భాగం. ప్రతి ఏడాది ఈ పథకం కింద 8.2% వడ్డీ లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలో ఉన్న 80 సి సెక్షన్ కింద ఈ పథకానికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఈ పథకంలో కనిష్టంగా 250లో పెట్టుబడి తో మొదలు పెట్టవచ్చు. మొత్తం 14 ఏళ్ళు ఈ పథకంలో డబ్బు నిలువ చేసుకోవచ్చు. ఒరిస్సా ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్రంలో నివసించే మహిళల కోసం సుభద్ర యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులు. ఒరిస్సా రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్థిక స్వలంబన అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
ప్రతి మహిళకు 5 సంవత్సరాలలో రూ.50,000 వరకు ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందించబడుతుంది. అంటే ప్రతి ఏడాది కూడా రూ.10,000 రూపాయలు చొప్పున ప్రతి మహిళకు డబ్బు లభిస్తుంది. స్కూల్లో చదువుతున్న బాలికల కోసం ఎంఎస్ ఐజిఎస్ ఈ పథకం రూపొందించారు. ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల విద్యార్థినిల కోసం ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కో బాలికపు ఈ పథకం కింద ₹3,000 ఆర్థిక సహాయం అందిస్తారు. 2023లో మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ ప్రారంభించారు. ఇందులో గరిష్టంగా మహిళలు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. మహిళలకు ఇందులో 7.5% వడ్డీ లభిస్తుంది. ఈ పథకాలు పూర్తిగా ప్రభుత్వ భరోసాతో నడుస్తాయి కాబట్టి ఇందులో తక్కువ రిస్కు మరియు ఎక్కువ రాబడి ఉంటుంది.