Tollywood: బాలీవుడ్ నుంచి తెలుగులో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తొలి సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది. దాంతో మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి స్టార్ డం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ తన కుటుంబంతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అలాగే మరి కొంతమంది మాత్రం తొలి సినిమాతో డిజాస్టర్ అందుకొని ఆ తర్వాత అవకాశాలను అందుకోలేకపోతున్నారు. అందం, అభినయం ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నారు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా తెలుగులో చేసిన ఒక్క సినిమాతో డిజాస్టర్ అందుకొని ఆ తర్వాత తెలుగులో అవకాశాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని తన కుటుంబంతో లైఫ్ గడుపుతుంది. ఈమె మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి చిత్రంతో అమృత రావు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది.
టాలీవుడ్ లో యాక్షన్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పరాజయం పొందింది. కానీ ఈ సినిమాలో హీరో మహేష్ బాబు లుక్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు లాంగ్ హెయిర్ లో చాలా స్టైలిష్ గా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని పాటలు మాత్రం అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయి. ఇక ఈ సినిమా తోనే అమృత రావు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మోడలింగ్ రంగం నుంచి అమృత రావు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో షాహిద్ కపూర్ కు జోడిగా వివాహ సినిమాతో అమృత రావుకు బాగా క్రేజ్ వచ్చింది.
కానీ తెలుగులో మాత్రం ఈమెకు అవకాశాలు రాలేదు. అమృత రావు హిందీలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో అమృత రావు నటించిన అతిధి సినిమా తో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. చివరిసారిగా అమృత రావు 2018లో రిలీజ్ అయిన సంజు సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. అమృత రావు అన్మోల్ అనే రేడియో జాకిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. వీరిద్దరూ దాదాపు 7 ఏళ్ళు ప్రేమించుకొని 2013 మే 15న ముంబైలో వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో మాత్రం అమృత రావు చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో చేరువలో ఉంటుంది.