Mogalirekulu Serial Actress: ఒకప్పుడు ఇది ప్రేక్షకుల నుంచి బాగా ఆదరణ పొందిన సీరియల్. ఫ్యామిలీ ఆడియోస్ తో పాటు యూత్ కూడా ఈ సీరియల్కు అప్పట్లో వీరాభిమానులు. ఇప్పటికీ కూడా మొగలిరేకులు సీరియల్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది అంటే నమ్మసక్యం కాదు. ప్రస్తుతం ఈ సీరియల్ యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అప్పట్లో ఈ సీరియల్ లో నటించిన నటీనటులకు సైతం ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. ఒకప్పుడు మొగలిరేకులు సీరియల్ బుల్లితెర మీద విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సీరియల్ కు కేవలం ఆడవాళ్లు మాత్రమే కాకుండా మగవాళ్ళు అలాగే యూత్ కూడా బాగా ఇష్టపడేవారు. ఈ సీరియల్ రొటీన్ అత్తా కోడళ్ళ సీరియల్ లాగా కాకుండా యువతను ఆకట్టుకునేలాగా అలాగే ప్రతిక్షణం ఊహించని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా ఉండేది. ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఈ సీరియల్కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది అంటే నమ్ముతారా.
చాలా అందమైన ప్రేమ కథతో పాటు యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ వంటి వాటితో మొగలిరేకులు సీరియల్ కొన్ని సంవత్సరాల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ ఇష్టపడని వారు అంటూ అప్పట్లో ఎవరు ఉండరు. ఈ సీరియల్ లో ఉన్న ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇక మొగలిరేకులు సీరియల్ హీరో, హీరోయిన్ పాత్రకు అయితే ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. మొగలిరేకులు సీరియల్ మున్నా పాత్రలో నటించిన ఆర్కే నాయుడు, శాంతి, సెల్వా, దేవి, ఈశ్వర్ పాత్రలకు బాగా ఫాలోయింగ్ ఏర్పడింది. తమ సహజ నటనతో ఈ పాత్రలు అన్నీ కూడా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మొగలిరేకులు సీరియల్ లో మున్నా, దేవి లవ్ స్టోరీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మున్నా పాత్రలో ప్రేక్షకులకు దగ్గరైన సాగర్ ఈ మధ్య సీరియల్స్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ సీరియల్ లో దేవి పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ కూడా ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటుంది. ఈమె పేరు లిఖిత కామినీ. అప్పట్లో లిఖిత బుల్లితెర ప్రేక్షకులను తన అందంతో, అభినయంతో కట్టిపడేసింది. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలోనే లిఖిత పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే లిఖిత నటనకు గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో కూడా లిఖిత అంతగా యాక్టివ్ గా ఉండదు. కానీ ప్రస్తుతం లిఖిత కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.