https://oktelugu.com/

Srila Venkataratnam: అమ్మో.. అక్కడ పనిచేయడం చాలా కష్టం.. అందుకే గుడ్‌బై చెప్పాను.. ఎన్నారై శ్రీల వెంకటరత్నం షాకింగ్‌ కామెంట్స్‌..!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ సీఈవో అయిన మస్క్‌ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కార్లతోపాటు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. భారత్‌లో కూడా టెస్లా ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 24, 2024 / 03:10 PM IST

    Srila Venkataratnam

    Follow us on

    Srila Venkataratnam: ఎలాన్‌ మస్క్‌.. ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితం ఉన్న వ్యక్తి. నిమిషానికి కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మస్క్‌ ప్రపంచ కుబేరుడు. అమెరికాలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లాను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తర్వాత వివిధ దేశాల్లోనూ టెస్లా కార్ల అమ్మకాలు సాగిస్తున్నాడు. ఇక టెస్లాతోపాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కూడా కొనుగోలు చేశాడు. అంతరిక్ష నౌకలు తయారు చేస్తున్నారు. మనిషి మెదడులో చిప్‌ అమచ్చే ప్రయోగాలు విజయవంతంగా చేయిస్తున్నారు. ఆయన అడుగు పెట్టిన ప్రతీరంగంలో సక్సెస్‌ సాధిస్తున్న మస్క్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అంతరిక్షంలోని మనుషులను తీసుకెళ్లే ప్రయోగం కూడా చేస్తున్నారు. మస్క్‌ సంస్థలో ఉద్యోగం చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. అంతర్జాతీయ సంస్థలు కావడం, మంచి ప్యాకేజీ వేతనాలు ఉండడంతో చాలామంది ఇందులో పనిచేయాలనుకుంటారు. అదే విధంగా భారత సంతతికి చెందిన శ్రీల వెంకటరత్నం కూడా టెస్లా కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నారు. టెస్లాకు పదేళ్లకుపైగా వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన శ్రీల వెంకటరత్నం తన పదవికి రాజీనామా చేశారు.

    ఇద్దరే మహిళలు..
    టెస్లాలో కేవలం ఇద్దరు మహిళా ఉపాధ్యక్షులు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరుగా ఉన్న శ్రీల తమ లింక్డ్‌ఇన్‌ పేజీలో ఈ వారం ప్రారంభంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘టెస్లా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అక్కడ పని చేయడం అంత సులభం కాదని ఆమె పేర్కొన్నారు. ఆమె టెస్లా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఆ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారుగా ఎదిగింది. కంపెనీలో కేవలం ఇద్దరు మహిళా ఉపాధ్యక్షులలో ఒకరిగా, మనం కలిసి సాధించిన విజయాలపై నేను గర్విస్తున్నాను. నేను వెళ్లిపోయే సమయానికి, టెస్లా సంవత్సరానికి దాదాపు 100 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ విలువ 700 బిలియన్‌ డాలర్లు చేరుకుంది. ఒకే సంవత్సరంలో 18 లక్షల కార్లను అమ్ముడయ్యాయి’ అని శ్రీల పేర్కొన్నారు. టెస్లా కంపెనీ మాజీ ఆర్థిక అధికారి జేసన్‌ వీలర్‌ శ్రీల వెంకటరత్నంను అభినందించినప్పుడు, ఆమె టెస్లాలో పని చేయడం ఎంత కష్టమో గుర్తు చేశారు. దానికి సమాధానంగా, శ్రీల టెస్లాలో పని చేయడం చాలా కష్టమైన పని అని మరోసారి చెప్పారు.

    సంస్థను వీడుతున్న ఉద్యోగులు..
    ఇదిలా ఉంటే టెస్లా కంపెనీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. వీరిలో కొందరు చాలా సంవత్సరాలుగా ఆ కంపెనీలో పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. టెస్లా మాజీ హెడ్‌ ఆఫ్‌ ప్రొడక్ట్‌ లాంచ్‌ రిచ్‌ ఒట్టో మాట్లాడుతూ టెస్లా కంపెనీ చాలా బాగున్నప్పటికీ, అక్కడ పని చేయడం చాలా కష్టమని చెప్పారు. కంపెనీలో చాలామంది ఉద్యోగులను తొలగించడం వల్ల, ఆ కంపెనీ ముందు ఎలా ఉంటుందో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఎలాన్‌ మస్క్‌ కంపెనీలో వర్క్‌ చేయడం చాలా హార్డ్‌ అనే విషయం అర్థమవుతోంది.