Homeబిజినెస్Samsung Galaxy S24 FE: తక్కువ ధరలో ప్రీమియం ఫోన్.. ఇదే మంచి అవకాశం..

Samsung Galaxy S24 FE: తక్కువ ధరలో ప్రీమియం ఫోన్.. ఇదే మంచి అవకాశం..

Samsung Galaxy S24 FE: ప్రముఖ మొబైల్ కంపెనీ Samsung నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందంటే దాని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే మిడ్ రేంజ్ పీపుల్స్ నుంచి ప్రీమియం ఫోన్లను అందించే ఈ కంపెనీ కి చెందిన కొన్ని మొబైల్ పై ఇటీవల భారీ తగ్గింపును ప్రకటించింది. గతంలో మార్కెట్లోకి వచ్చిన Samsung Galaxy S24 FE అనే మొబైల్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. అంతేకాకుండా బ్యాంకు క్రెడిట్ కార్డు పై కొనుగోలు చేస్తే మరింత తక్కువకు పొందే అవకాశం ఉంది. డిస్కౌంట్ ప్రకటించిన ఈ మొబైల్ లో ఉండే ఫీచర్లు ఏంటి? బ్యాటరీ సామర్థ్యం ఎలా ఉంది?

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో

Samsung Galaxy S 24 FE మార్కెట్లోకి వచ్చిన సమయంలో దీని ధర రూ.59,999 గా నిర్ణయించారు. అయితే ఇది ప్రీమియం ధర కావడంతో కొంతమంది మాత్రమే దీని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ఈ మొబైల్ ను ఫ్లిప్కార్ట్ ద్వారా రూ.39,999 కే అందిస్తున్నారు. అంతేకాకుండా దీనిని బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ మొబైల్లో రూ. 37,999 కే పొందవచ్చు. ఇదే కాకుండా పాత మొబైల్ ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింత తగ్గింపు ధరతో దీనిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

Samsung Galaxy S 24 FE మొబైల్ ఫ్లాగ్ షిప్ తో ఉండడంతో ఈ రకమైన మొబైల్ కొనాలని అనుకునే వారు తక్కువ ధరకే దీనిని పొందవచ్చు. ఇందులో 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో 2400 e చిప్ సెట్ ను అమర్చారు. దీంతో రోజువారి అవసరాలతో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని బ్యాక్ సైడ్ లో ట్రిపుల్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా 50 MP మెయిన్ కెమెరా ఉండడంతో పాటు 12 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. అలాగే 8 MP టెలిఫోటో అనుభవాన్ని ఇవ్వనుంది. అధిక మెగా పిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

ఇందులో బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగ్గా కనిపిస్తుంది.4,700 mAh అనే బ్యాటరీ ఉంది. దీనిని రోజంతా వినియోగించినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది. ఈ బ్యాటరీ ఫాస్టెస్ట్ చార్జింగ్తో కూడా సపోర్ట్ చేయడంతో బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి మద్దతు ఉంటుంది. ఇప్పటికే సాంసంగ్ ఫోన్ ఉన్నవారు సైతం పాత ఫోన్ స్థానంలో కొత్త ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ కొనాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని కంపెనీ ప్రజలలో తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version