Homeబిజినెస్Apple latest MacBook: Apple కంపెనీ నుంచి అద్భుతమైన మ్యాక్ బుక్.. చూస్తే వెంటనే కొంటారు..

Apple latest MacBook: Apple కంపెనీ నుంచి అద్భుతమైన మ్యాక్ బుక్.. చూస్తే వెంటనే కొంటారు..

Apple latest MacBook: Apple కంపెనీ మొబైల్స్ అంటే ఎవరికైనా ఇష్టమే. వీటి ధర ఎక్కువగా ఉన్నా.. ఎగబడి మరీ కొంటారు. అయితే ఈ కంపెనీ నుంచి ఫోన్లు మాత్రమే కాకుండా Notebooks కూడా మార్కెట్లోకి వచ్చి అలరిస్తూ ఉంటోంది. ఈ మార్చి 3వ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆపిల్ కంపెనీ కొత్తగా M5 పేరుతో కొత్త మ్యాక్ బుక్ ను ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీతో కూడిన ల్యాప్ టాప్ కంటే అసాధారణమైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇందులో AI ఫీచర్లతో పాటు నేటితరం వారికి అనుగుణంగా GPUను కలిగి ఉంది. అలాగే ఇందులో 512 నుంచి 1 TB వరకు స్టోరేజ్ అవకాశం ఉండడంతో విద్యార్థులతో పాటు ఉద్యోగులకు ఇది అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే?

కొత్తగా ఆవిష్కరించిన M5 మ్యాక్ బుక్ బరువు తేలికగా ఉంటుంది. దీని చుట్టూ అల్యూమినియంతో తయారు చేసిన డిజైన్ ను చూడొచ్చు. ఇందులో 13.6 ,15.6 అంగులాళ లిక్విడ్ రెటీనా డిస్ ప్లేను అమర్చారు. ఇది రోజువారి వినియోగదారులతో పాటు విద్యార్థులకు సపోర్టుగా ఉండనుంది. అలాగే గేమింగ్ కోరుకునేవారికి అద్భుతమైన కలర్స్ తో డిస్ ప్లే చూపిస్తుంది. ఈ కొత్త మ్యాక్ బుక్ లో అసాధారణమైన బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 18 గంటల పాటు నిరంతరంగా వాడినా ఎలాంటి డౌన్ టైమ్ తక్కువ కాకుండా ఉంటుంది.

Also Read: మిడిల్ రేంజ్ పీపుల్స్ కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా.. బడ్జెట్లోనే లగ్జరీ ఫీచర్స్ ఫోన్..

కెమెరా విషయంలోనూ పర్ఫామెున్స్ మెరుగ్గా ఉంది. ఇందులో 12 MP మెయిన్ కెమెరా వినియోగదారులకు కావల్సిన ఫోటోలను అందిస్తుంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కోరుకునేవారికి అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అలాగే ఇందులో వైఫై 7, బ్లూటూత్ 6, వైర్ లెస్ నెట్ వర్కింగ్ చిప్ అయిన N1ఉన్నాయి. ఇందులో ప్రధానంగా CPU కోర్ తో పాటు 10 కోర్ CPUఉంది. ఇది వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. ఒకేసారి పలు రకాల యాప్స్ యూజ్ చేసినా కూడా నోట్ బుక్ వేగం తగ్గదు.

M5 మ్యాక్ బుక్ ధర విషయానికి వస్తే.. 13 అంగుళాల డిస్ ప్లే కలిగిన 1,099 డాలర్లు ఉండగా.. 15 అంగుళాల మ్యాక్ బుక్ 1,299 డాలర్లతో అందుబాటులో ఉంది. స్కైబ్లూ, మిడ్ నైట్, స్టార్ లైట్ తో పాటు సిల్వర్ కలర్లలో ఈ మ్యాక్ బుక్ అందుబాటులో ఉన్నాయి. వీటిని Apple స్టోర్ లో బుక్ చేసుకోవచ్చు. మార్చి 11 నుంచి వీటిని డెలివరీ చేస్తారు. ఇందులో 512 నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్ ఉండడంతో ఫొటోలు, వీడియోలు కావాల్సినన్ని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version