Insta Profile Song: ఇన్ స్టా గ్రామ్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా..

Insta profile song: ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టే తిరుగుతోంది. సోషల్ మీడియాలోనే జీవిస్తోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి మొదలుపెడితే రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతోనే కాలక్షేపం సాగుతోంది. విస్తృతమైన సోషల్ మీడియాలో ఇన్ స్టా గ్రామ్ యాప్ చాలా విభిన్నమైనది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 24, 2024 3:21 pm

Insta Profile Song

Follow us on

Insta Profile Song: ఇన్ స్టా గ్రామ్ యాప్ మాతృ సంస్థ మెటా. ఇప్పటికే ఈ కంపెనీకి వాట్సాప్, ఫేస్ బుక్ యాప్స్ ఉన్నాయి.. వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా మూడు బిలియన్లకు మించిన యూజర్లతో అలలారుతోంది. యూజర్లకు అద్భుతమైన అనుభూతి ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. ఇక ఇన్ స్టా గ్రామ్ లోనూ ఇదే విధానం కొనసాగిస్తోంది. ఇప్పటికే యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఇన్ స్టా గ్రామ్ లో సరికొత్త మార్పులు, చేర్పులు చేసిన మెటా యాజమాన్యం.. ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఇన్ స్టా గ్రామ్ ప్రొఫైల్ సాంగ్ పేరుతో ఈ ఫీచర్ ను ఏర్పాటు చేసింది. యూజర్ ఒకవేళ దీనిని కనుక ఈ యాక్సెస్ చేసుకుంటే.. వారి మూడ్ కు తగ్గట్టుగా సాంగ్స్ ను ప్రొఫైల్ లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతర యూజర్లు ప్రొఫైల్ చూసినప్పుడు ఆ పాట వినిపిస్తుంది.

ప్రొఫైల్ లో సాంగ్ పెట్టుకున్నంత మాత్రాన.. ఆటో ప్లే అనే అవకాశం మెటా కల్పించలేదు. ఒకవేళ ఆ పాట ప్లే కావాలి అంటే.. కచ్చితంగా ప్లే బటన్ నొక్కాల్సిందే. గరిష్టంగా 30 సెకండ్ల పాటు పాటను సెట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగదారులందరికీ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మెటా చెబుతోంది. టెస్టింగ్ దశలో భాగంగా కొంతమంది వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగతా వారికి కూడా ఇది అందుబాటులోకి రావాలంటే ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అన్ని పాటలు కాకుండా కేవలం లైసెన్స్ డ్ పాటలను మాత్రమే మెటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పాటలకు సంబంధించి అమెరికా నాయకురాలు సబ్రీనా కార్పెంటర్ మెటా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.. ప్రొఫైల్లో ఒక పాట సెట్ చేసుకున్న తర్వాత.. మార్పులు చేర్పులు చేపట్టే వరకు అది ప్రొఫైల్లో అలాగే ఉంటుంది.. ప్రస్తుతానికి వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో స్టేటస్ ఒక్కరోజులోనే మాయమవుతుంది. ఆ తర్వాత మరో స్టేటస్ అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఇన్ స్టా గ్రామ్ ప్రొఫైల్ సాంగ్ విషయంలో మాత్రం ఇలా మాయం అయ్యేందుకు అవకాశం ఉండదు. మరో పాటను మార్చే వరకు అది అలాగే ఉంటుంది..

పాటను ప్రొఫైల్ లో ఏర్పాటు చేసుకోవాలంటే

ఇన్ స్టా గ్రామ్ ను ముందుగా ఓపెన్ చేయాలి. ప్రొఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దక్షిణ పాటను ఎంచుకోవాలి. క్లిప్ డ్యూరేషన్ పై క్లిక్ చేసి.. సమయాన్ని ఎంచుకోవాలి. 30 సెకండ్ల పాటు గరిష్టంగా ఒక పాటను ప్రొఫైల్ లో పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.. ఈ ఆప్షన్ వల్ల యూజర్లకు సరికొత్త అనుభూతి లభిస్తుందని మెటా చెబుతోంది.. మెటా యాజమాన్యం పరిధిలో ఉన్న ఇన్ స్టా గ్రామ్.. ఫేస్ బుక్ , వాట్సప్, తర్వాత అత్యధిక యూజర్ లు ఉన్న సోషల్ మీడియా యాప్ గా కొనసాగుతోంది.