Tesla : ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న TESLA కంపెనీ అధినేత ఎలన్ మస్క్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కార్ల కంపెనీ అధినేత అయిన ఇతని పర్సనల్ విషయాలు కూడా చాలామందికి ఆసక్తిని కలిగించాయి. అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఏర్పాటుచేసిన Space X సహాయంతో అమెరికాలోని నాసా ఇటీవల అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ బృందాన్ని భూమి పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎలన్ మస్క్ మరింత పాపులర్ అయిపోయారు. అయితే ఇండియాలో టెస్ట్లా కంపెనీకి చెందిన కార్ల ప్లాంటు ఏర్పాటు కాబోతున్న విషయం తెలిసిందే. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీతో Elan మస్క్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టెస్లా కంపెనీ ప్లాంటును బొంబాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ప్లాంట్ ను తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కొన్ని పోటీ పడుతున్నాయి.. తెలంగాణ మాత్రం ఆ విషయంలో చొరవ చూపడం లేదు. కానీ టెస్లాకు మించిన ఓ కంపెనీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అదేంటంటే?
Also Read : అసలేంటి చైనా బీవైడీ కార్లు.. టెస్లాను మించి వీటిలో ప్రత్యేకతలేంటి?
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టెస్లా కంపెనీకి మించినవారు లేరని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల Build Your Dream (BYD) అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కార్లు అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. ఇవి ఇస్లా కంపెనీకి చెందిన కార్ల కంటే అత్యధికంగా ఉండడం విశేషం. 2023 వ సంవత్సరంలో టెస్లా కంపెనీ 1.84 మిలియన్ బ్యాటరీ కార్లను ఉత్పత్తి చేస్తే.. బివైడి కంపెనీ మూడు మిలియన్ల కంటే ఎక్కువ కార్లను ఉత్పత్తి చేసింది. 2024 చివరి త్రైమాసికంలో టెస్లా కంపెనీ 1.77 మిలియన్ కార్లను ఉత్పత్తి చేస్తే.. బి వై డి కంపెనీ 1.78 మిలియన్ కార్లను ఉత్పత్తి చేసి మార్కెట్లో రిలీజ్ చేసింది. అంతేకాకుండా టెస్ట్లా కంపెనీ కార్ల కంటే బివైడి కంపెనీ కార్లు ఎక్కువగా ఆదరణ పొందుతున్నట్లు తెలుస్తోంది. బి వై డి కంపెనీ చైనాలో నెంబర్ వన్ గా నిలుస్తోంది. ఇప్పుడు ఇది యూరప్ లోని కొన్ని దేశాల్లో విస్తరిస్తోంది.
అయితే Tesla కంపెనీ భారత్లో అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బివైడి కంపెనీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బి వై డి కంపెనీ ప్లాంటును ఏర్పాటు చేయడం ద్వారా అత్యధిక ప్రయోజనాలు పొందవచ్చని భావిస్తోంది. చైనాకు చెందిన ఈ కంపెనీ కార్లు విద్యుత్ వేరియంట్లలో ఎంతో ఆదరణ పొందుతున్నాయి.
అయితే మార్కెటింగ్ విషయంలో మాత్రం బివైడి కంటే టెస్లా ఎక్కువగా విస్తరించుకొని ఉంది. దీంతో టెస్లా నుంచి వచ్చిన ఏ కారు అయినా వెంటనే వినియోగదారుల వద్దకు చేరిపోతుంది. బి వై డి కార్లు మాత్రం ఆలస్యంగా మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే బివైడి కంపెనీకి చెందిన కార్లు అత్యధిక ధరను కలిగి ఉంటాయి.
Also Read : ఎలన్ మస్క్ ఏం చేస్తున్నావ్? 8 ఏళ్లుగా టెస్లా కారు కోసం ఎదురుచూపులు!