Volkswagen
Volkswagen : జర్మనీ చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తన కస్టమర్లకు భారీ శుభవార్తను అందించింది. ఫోక్స్‌వ్యాగన్ తమ రెండు కార్లైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లపై రూ. 2.5 లక్షల వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, కంపెనీ వినియోగదారులకు 4 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీని, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్ల యజమానులకు రూ.50 వేల లాయల్టీ బెనిఫిట్‌ను కూడా అందిస్తోంది. దీనితో పాటు ఫోక్స్‌వ్యాగన్ స్క్రాపేజ్ బెనిఫిట్‌ను కూడా అందజేయనుంది.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ లైన్ 1.0-లీటర్ టీఎస్‌ఐ ఏటీపై రూ.83,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వర్టస్ జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టీఎస్‌ఐ డీఎస్‌జీపై రూ.1.35 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ క్రోమ్ హైలైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఏటీపై రూ. 1.90 లక్షల వరకు ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే, టాప్‌లైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఏటీ మోడల్‌పై రూ.1.87 లక్షల వరకు ప్రయోజనం ఉంది. వర్టస్ జీటీ ప్లస్ క్రోమ్ 1.5 లీటర్ టీఎస్‌ఐ డీఎస్‌జీపై కూడా రూ.1.29 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభ ధర రూ.11.56 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ.19.40 లక్షల వరకు ఉంటుంది.
Also Read : ఉక్కు కంటే స్ట్రాంగ్ బాడీ ఉన్న ఎస్ యూవీ బుకింగ్స్ షురూ.. డెలివరీ ఎప్పుడంటే ?
ఫోక్స్‌వ్యాగన్ టైగన్
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జీటీ లైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఏటీపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టీఎస్‌ఐ డీఎస్‌జీపై రూ.2 లక్షల వరకు బెనిపిట్ అందిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ హైలైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఏటీపై రూ.2.5లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తుంది. టాప్‌లైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఎంటీపై రూ.2.36 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. జీటీ ప్లస్ క్రోమ్ 1.5 లీటర్ టీఎస్‌ఐ డీఎస్‌జీపై కస్టమర్లు రూ. 2.39లక్షల వరకు లాభం పొందగలరు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బేస్ మోడల్ ధర రూ. 11.70 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ.21.10లక్షల వరకు ఉంటుంది.
బుకింగ్ ప్రారంభం
ఫోక్స్‌వ్యాగన్ భారతీయ మార్కెట్‌లో టిగువాన్ ఆర్-లైన్ (Tiguan R-Line) కోసం ప్రీ-బుకింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్యూవీ ఏప్రిల్ 2025లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్‌లో 2.0-లీటర్ టీఎస్‌ఐ ఇంజన్ అమర్చారు. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ టర్బో-చార్జ్డ్ ఫోర్-సిలిండర్ ఇంజన్ 190 బీహెచ్‌పీ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
టిగువాన్ ఆర్-లైన్ ఫీచర్లు
టిగువాన్ ఆర్-లైన్‌ను బ్లాక్ రంగు గ్రిల్, ఫ్రంట్ బంపర్, సైడ్ సిల్స్, ట్రిమ్, లోయర్ క్లాడింగ్ స్పెషల్ గా ఉంచుతాయి. ఇది ప్రత్యేకమైన ఆర్-లైన్ బ్యాడ్జింగ్‌తో వస్తుంది. ఇందులో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ ఛానెల్స్ ఉన్నాయి. ఈ SUVలో 19-ఇంచుల అల్లాయ్ వీల్స్, ఆల్-సీజన్ టైర్లు, బ్లాక్ రూఫ్ రైల్, పవర్-అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎల్‌ఈడీ లైటింగ్ ఉన్నాయి. టిగువాన్‌లో వీటితో పాటు రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, రిమోట్-కంట్రోల్ పవర్ లిఫ్ట్‌గేట్ కూడా ఉన్నాయి.
Also Read : వోక్స్ వ్యాగన్ పై భారీ టాక్స్ చోరీ ఆరోపణలు..బాంబే హైకోర్టులో కేసు.. అసలేం జరిగింది ?