https://oktelugu.com/

Tesla : ఎలన్ మస్క్ ఏం చేస్తున్నావ్? 8 ఏళ్లుగా టెస్లా కారు కోసం ఎదురుచూపులు!

Tesla : 2017లో టెస్లా తన సెడాన్ క్లాస్ టెస్లా రోడ్‌స్టర్‌ను ప్రదర్శించింది. ఈ కారు బుకింగ్ కూడా అదే సమయంలో మొదలైంది. 2020 నుంచి దీని డెలివరీని ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. కానీ ఈ కారు బుక్ చేస్తున్న వాళ్లకు ఇప్పటికీ డెలివరీ ఇవ్వలేదు కంపెనీ.

Written By: , Updated On : March 24, 2025 / 07:14 PM IST
Tesla Car

Tesla Car

Follow us on

Tesla : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ప్రతిష్టాత్మక కంపెనీ ఉత్పత్తి చేసే టెస్లా కారు కోసం ప్రజలు సుమారు ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇది వాస్తవం. భారతీయులు కొన్నేళ్లుగా టెస్లా కారు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలోని అతిపెదద్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల్లో ఒకటైన టెస్లా 2017లో ఒక కారును ప్రదర్శించింది. దాని డెలివరీ కోసం ప్రజలు ఇప్పటికీ ఎదురు చూస్తునే ఉన్నారు.

Also Read : ఈ కారు కావాలంటే ఇప్పుడు బుక్ చేస్తే మూడేళ్లకు వస్తుంది

2017లో టెస్లా తన సెడాన్ క్లాస్ టెస్లా రోడ్‌స్టర్‌ను ప్రదర్శించింది. ఈ కారు బుకింగ్ కూడా అదే సమయంలో మొదలైంది. 2020 నుంచి దీని డెలివరీని ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. కానీ ఈ కారు బుక్ చేస్తున్న వాళ్లకు ఇప్పటికీ డెలివరీ ఇవ్వలేదు కంపెనీ. ఒకవైపు ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయం చేసిన ఈ కారు ఇంకా ప్రజలకు అందలేదు. మరోవైపు, టెస్లా అధికారిక వెబ్‌సైట్‌లో రోడ్‌స్టర్ బుకింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. హెచ్‌టి ఆటో నివేదిక ప్రకారం.. కంపెనీ వెబ్ సైట్లో టెస్లా రోడ్‌స్టర్ బుకింగ్ 50,000 డాలర్లకు కొనసాగుతోంది.

ఈ కారును ప్రవేశ పెట్టిన తర్వాత టెస్లా ‘సైబర్‌ట్రక్’ (Tesla Cybertruck), ‘మోడల్ వై’ (Model Y) వంటి మోడల్స్ ప్రవేశ పెట్టింది. వాటి డెలివరీ కూడా ప్రారంభమైంది.. కానీ ప్రజలు ఇప్పటికీ రోడ్‌స్టర్ ఎప్పుడెప్పుడు డెలివరీ చేస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.

టెస్లా సైబర్‌ట్రక్ కథ కూడా ఇలాంటిదే. చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో ఉన్న ఈ ఎస్‎యూవీ కారును టెస్లా దాదాపు పదేళ్ల కిందట పరిచయం చేసింది. ఆ తర్వాత దాని లాంచింగ్ కూడా చాలాసార్లు వాయిదా పడింది. చివరికి నవంబర్ 2023లో కంపెనీ ఈ కారును ఉత్పత్తి చేసి ప్రారంభించింది.. డెలివరీని కూడా మొదలు పెట్టింది. ఇదే సమయంలో టెస్లా ఇండియాలోకి ప్రవేశించడం ఖాయమైంది. కంపెనీ ఏప్రిల్-మే మధ్య ఇండియాలో తన కార్లను ప్రదర్శించడంతో పాటు వాటి బుకింగ్‌లను ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల, టెస్లా ఇండియాలోని ముంబై, ఢిల్లీలలో షోరూమ్‌లను తెరవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీని కోసం స్థలాన్ని లీజుకు తీసుకోవడం, సిబ్బందిని నియమించడం కూడా ప్రారంభించింది.

Also Read : ఈ ఛాన్స్ పోతే జీవితంలో మళ్లీ రాదు.. రూ.60కే ఈ రెండు బైక్స్