TATA Punch Interior: కారు కొనాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ బడ్జెట్ లో తీసుకోవాలని చాలా మంది ఎదురుచూస్తుంటారు. అయితే మంచి ఫీచర్స్, ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండే కొన్ని కార్లు అధిక ధరను కలిగి ఉంటాయి. దీంతో కొంతమంది అయోమయంలో పడి బడ్జెట్ కారు కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే కొన్ని కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు పండుగ సీజన్లలో, ప్రత్యేక రోజుల్లో ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. కానీ ఓ కంపెనీకి మాత్రం పండుగల సీజన్ పూర్తిగా ప్రారంభం కాకముందే భారీ ఆఫర్స్ ను ప్రకటించింది.మంచి ఫీచర్స్ ఉండడంతో పాటు మైక్రో ఎస్ యూవీగా అవతరించిన ఈ కారు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. మిగతా కంపెనీల కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. అయినా వినియోగదారులను ఆకర్షించడానికి లేటేస్టుగా ఓ కారుపై రూ.25 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో తక్కువ ధరలో కారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఏదో తెలుసా? టాటా.. దేశంలో టాటా కంపెనీకి మంచి పేరు ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు వచ్చాయి. ముఖ్యంగా టాటా నుంచి ఎస్ యూవీలు రిలీజ్ అయి వినియోగదారులకు ఆకట్టుకున్నాయి. అయితే ఈ కంపెనీ మైక్రో ఎస్ యూవీలను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మైక్రో ఎస్ యూవీని ఇప్పటికే బడ్జెట్ లో అందిస్తోంది. దీనిపై ఇప్పుడు డిస్కౌంట్ ప్రకటించింది. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?
టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయిన మోడళ్లలో పంచ్ ఒకటి. మైక్రో ఎస్ యూవీ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు కు మంచి ఆదరణ పొందిన ఈ కారుపై కంపెనీ వినియోగదారులను ఆకర్షించే విధమైన డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో ఈ కారు సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. టాటా పంచ్ 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ ను కలిగిన ఈ కారు పెట్రోల్ వేరియంట్ లో 20.09 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వేరియంట్ లో 26.99 కిలోమీటర్లతో దూసుకుపోతుంది. ఆటోమేటికి ట్రాన్స్ మిషన్ తో పనిచేసే ఈ మోడల్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
టాటా పంచ్ ఇంటీరియర్ లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు డిజిటల్ అన్ లాగ్, ఇనస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇందులో ఎల్ ఈడీ రన్నింగ్ లైట్లు, దిగువ బంపర్ పై ఫాగ్ లైట్లు అమర్చబడ్డాయి. 16 అంగుళాల డైమండ్ అల్లాయ్ వీల్స్, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, వై ఆకారంలో ఎల్ ఈడీ లైట్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్రైవర్ సీటు అడ్జస్టబుల్ వంటి ఆకర్షించే ఫీచర్లు ఉన్నాయి.
టాటా పంచ్ ను ప్రస్తుతం రూ. 7 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ ను రూ. 10 లక్షలకు వరకు అమ్ముతున్నారు. అయితే తాజాగా ఈ కారుపై రూ..25 వేల డిస్కౌంట్ ను ప్రకటించారు. ఇందులో పెట్రోల్ వేరియంట్ లో రూ.20 వేలు క్యాష్ బ్యాక్ ఇస్తుండగా.. రూ.5 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ను అందించనున్నారు. సీఎన్ జీ వేరియంట్ పై రూ.15 వేల నగదు వాపస్ ఇస్తుండగా.. రూ.5 వేలు కార్పొరేట్ రిబేట్ లభించనుంది. అయితే 2023, 2024 మోడళ్లపై మాత్రమే ఈ డిస్కౌంట్ ఉంటుందని కంపెనీ పేర్కొంది.