https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు తో సినిమా చేయడానికి శత విధాల ప్రయత్నం చేసిన అల్లు అరవింద్… ఇక ఫైనల్ గా ఏం జరిగిందంటే..?

మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మాత్రం సెలెక్టెడ్ గా ఉంటూ ఏ ప్రొడ్యూసర్స్ తో సినిమా చేయాలి అనేది ముందుగానే కన్ఫామ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 5, 2024 / 08:48 AM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో అల్లు అరవింద్ ఒకరు. ఏ హీరోతో అయిన తను సినిమా చేయాలి అనుకుంటే ఆ హీరోని ఎలాగైనా సరే ఒప్పించి వాళ్ళ చేత సినిమా చేయించుకునే తెలివైన ప్రొడ్యూసర్…ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది స్టార్ హీరోలతో సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలకే హీరోలు పడిపోతారు అంటూ ఇండస్ట్రీ లో ఒక టాక్ అయితే ఉంది. మరి ఇలాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఎంతగా ట్రై చేసిన కూడా మహేష్ బాబు తో సినిమాని చేయలేకపోతున్నాడు అనేది వాస్తవం… మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…అయితే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని తను బలంగా కోరుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాని పాన్ వరల్డ్ లో తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో ఎవరికి దక్కని ఒక అరుదైన గౌరవాన్ని కూడా తను దక్కించుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళబోతున్న నేపథ్యంలో మహేష్ బాబు ఈ సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయనతో ఒక సినిమా చేయాలని అల్లు అరవింద్ అనుకుంటున్నాడు. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.

    కొన్నిసార్లు కథ దొరికితే మహేష్ బాబు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం, ఇక ఇంకొన్ని సార్లు మహేష్ బాబు డేట్స్ దొరికిన తర్వాత కథ ఆయనకి నచ్చకపోవడం వల్ల ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ అనేది సెట్ అవ్వలేదు. అయితే కొద్దిరోజుల క్రితం వీళ్ళ కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక రీసెంట్ గా బన్నీ వాసు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా? రాదా? అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇచ్చాడు.

    ఇక అందులో భాగంగానే మహేష్ బాబుతో అల్లు అరవింద్ ఒక భారీ ప్రాజెక్టు చేయాలని నిశ్చయించుకున్నారట. కానీ మహేష్ బాబు నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ప్రస్తుతం ఆ సినిమాని రన్భీర్ కపూర్ తో చేస్తున్నారట. ఇక రన్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తున్న ‘రామాయణం ‘ సినిమాని మొదట మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారట. ఇక దీనికి అల్లు అరవింద్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక రాముడు క్యారెక్టర్ లో మహేష్ బాబు చాలా అద్భుతంగా ఉంటాడు అనేది మనందరికీ తెలిసిందే…

    కానీ మహేష్ బాబు మాత్రం ఈ ప్రాజెక్టు ను సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది మహేష్ బాబు అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే మహేష్ బాబు ఈ సినిమా చేయకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే రాముడి పాత్ర చేస్తే సినిమా మొదటి నుంచి చివరి వరకు షర్టు లేకుండా కనిపించాల్సి ఉంటుంది. మరి మహేష్ బాబు ఇప్పటివరకు షర్ట్ లేకుండా ఓపెన్ బాడీతో ఒకసారి కూడా కనిపించలేదు. అందుకే ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఉండచ్చు అంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి…