https://oktelugu.com/

Monsoon Season: వర్షకాలంలో ఈ పదార్థాలు తింటే రోగాలు దూరం.. రోగనిరోధక శక్తి అధికం.. అవెంటో తెలుసా?

ప్రస్తుతం కూరలు వండేటప్పుడు కొందరు పసుపును ఎక్కువగా వినియోగించడం లేదు. పసుపు యాంటి సెప్టిక్ గా పనిచేస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా పాలు తీసుకునేటప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవడం వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 5, 2024 8:35 am
    Monsoon Season

    Monsoon Season

    Follow us on

    Monsoon Season: భారతదేశ వ్యాప్తంగా వర్షాలు విజృంభిస్తున్నాయి. కేరళ, కర్ణాటకలో వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మినహా దాదాపు అన్ని చోట్లు వర్షాలు కురిశాయి. అయితే వర్షపాతం తక్కువగా ఉన్నా కొన్ని రోజుల పాటు వాతావరణం చల్లగా మారింది. దాదాపు వారం రోజుల పాటు సూర్యుడు కనుమరుగయ్యాడు. ఈ నేపథ్యంలో వాతావరణంలో కలుషితం ఏర్పడింది. దీంతో వివిధ ఇన్ఫెక్షన్లు రావడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. డెంగ్యూ, వైరల్ ఫీవర్ తో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల డెంగ్యూ ఫీవర్ కు తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వర్షాకాలంలో ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ జోలికి పోకుండా వేడిగా ఉన్న పదార్థాలే తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి లభించే పండ్లు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కూరగాయలు, కిచెన్ కు సంబంధించిన పదార్థాలు సైతం రోజూవారీ ఆహారంలో తీసుకోవడం వల్ల వాతావరణంలో ఉండే ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక చల్లటి నీరుకు దూరంగా ఉండి కాచి వడబోసిన నీటిని మాత్రమే తీసుకోవాలి. జ్వరాలతో ఆసుపత్రికి వెళ్లి ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా.. పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే ఆరోగ్యంగా మారుతారు. మరి వర్షాకాలంలో ఎక్కువగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఏ యే పదార్థాల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది? ఆ వివరాల్లోకి వెళితే..

    ప్రస్తుతం కూరలు వండేటప్పుడు కొందరు పసుపును ఎక్కువగా వినియోగించడం లేదు. పసుపు యాంటి సెప్టిక్ గా పనిచేస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా పాలు తీసుకునేటప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవడం వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది. అంతేకాకుండా తలనొప్పితో తరుచుగా బాధపడేవారు ఇది తీసుకోవడం వల్ల నయమవుతుంది. ఇక జలుబు ఉన్న వారు పసుపు పాలు తీసుకుంటే శ్వాస తీసుకోవడం తేలిక అవుతుంది.

    శరీరానికి రోగనిరోధక శక్తి త్వరగా రావాలంటే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఆరేంజ్ పండులో సీ విటమిన్ అధికంగా ఉంటుంది. వీటితో పాటు జింక్, సెలీనియం వంటి ఖనిజాలు లభిస్తాయి. దీంతో శరీరానికి అదనపు శక్తి తోడై రోగల బారిన పడకుండా ఉంటారు.

    కాకర కాయ చూడగానే చాలా మందికి వికారం వస్తుంది. దీని కర్రీ చేదుగా ఉంటుందని కొందరు తినడానికి వెనుకడుగు వేస్తారు. కానీ వర్షాకాలంలో కాకర మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు కాకరకాయ తినడం వల్ల నయమవుతుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారు సైతం కాకర కాయ కూరను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

    బచ్చలి కూర గురించి నేటి వారికి ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంాయి. వీటిలో విటమిన్స్ తో పాటు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. ఊపిరితత్తుల సమస్యల నుంచి బచ్చలి కూర కాపాడుతుంది.

    వీటితో పాటు రోజూ వండే కూరల్లో అల్లం, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధులైన జలుబు వంటి వాటి నుంచి రక్షిస్తాయి. అలాగే క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఇవి రక్షిస్తాయి.