Homeబిజినెస్Tata nexon CNG: CNG వేరియంట్ లో దూసుకుపోతున్న కారు.. ఇందులో స్పెషల్ ఏంటంటే..

Tata nexon CNG: CNG వేరియంట్ లో దూసుకుపోతున్న కారు.. ఇందులో స్పెషల్ ఏంటంటే..

Tata nexon CNG: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ల వినియోగదారులు ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో CNG కార్లకు డిమాండ్ ఏర్పడింది. పెట్రోల్ కార్లతో పోలిస్తే సీఎన్ జీ కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో చాలా మంది వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో 2026 ఆర్థిక సంవత్సరంలో ఓ కంపెనీకి చెందిన CNGకారు 69,168 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. అదే టాటా నెక్సాన్ CNG. ప్రస్తుత మార్కెట్‌లో దీని పర్ఫామెన్స్ లో ఇతర కార్లకు వణుకు పుట్టిస్తోంది. ఈ కారు మైలేజ్, బడ్జెట్, సేఫ్టీలో ది బెస్ట్ కావడంతో చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఇంతకీ ఇందులో ఉన్న విశేషాలేంటో చూద్దాం..

2026 ఆర్థిక సంవత్సరంలో CNG కార్లలో టాటా నెక్సాన్ 69,168 యూనిట్లతో టాప్-5లో నమోదైంది. మారుతి బ్రెజ్జా వంటి ప్రత్యర్థులకు మైలేజ్, పవర్‌తో ఛాలెంజ్ చేస్తోంది. ఈ సబ్-కాంపాక్ట్ SUV భారతదేశంలో CNG సేల్స్ 10 లక్షలు దాటినా దీని డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ తో పాటు CNG ఇంజన్ కూడా అమర్చారు. ఈ ఇంజన్ 100 హార్స్ పవర్ ను అందిస్తుంది. పెట్రోల్‌ ఇంజన్ లో లీటర్ ఇంధనానికి 17 నుంచి 24 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. సీఎన్ జీలో 17 నుంచి 44 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

5-స్టార్ Global NCAP, Bharat NCAP రేటింగ్ కలిగిన ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటివి ఉన్నాయి. అలాగే 360-డిగ్రీ కెమెరా వంటివి సేప్టీని అందిస్తుంది. టాటా నెక్సాన్ CNG ఇంటీరియర్‌లో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో ఫ్యామిలీకి సౌకర్యవంతంగా ఉంటుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, JBL సౌండ్ సిస్టమ్ టాప్ వేరియంట్లలో. బోల్డ్ గ్రిల్, అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు ఆకట్టుకుంటాయి.

పర్పుల్ కలర్‌లో అందుబాటులో ఉండే ఈ టాటా నెక్సాన్ CNG మోడరన్ డిజైన్, అలాయ్ వీల్స్‌తో ఆకర్షణీయంగా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.99 లక్షల నుంచి రూ.14.59 లక్షల వరకు ఉంటుంది. 8 నుంచి 13 వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఇందులో స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ వంటి ట్రిమ్‌లు బడ్జెట్ అనుగుణంగా ఎంపికలు అందిస్తాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు సరిపడే ధరలో లభిస్తుంది. మైలేజ్, సేఫ్టీ, బడ్జెట్ తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో ఫ్యామిలీ SUVకి కారు కావాలని అనుకునేవారు టాటా నెక్సాన్ CNGని ఎంపిక చేసుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular