https://oktelugu.com/

సుకన్య సమృద్ధి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు భారీ షాక్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సామాన్యులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవ్దానికి సిద్ధమవుతోంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. బ్యాంకులు, ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతున్నాయి. జూన్ నెల 30వ తేదీన వడ్డీ రేట్ల అంశంపై సమీక్ష జరగనుందని తెలుస్తోంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 15, 2021 5:42 pm
    Follow us on

    Sukanya Samriddhi Yojana Interest Rates Cut

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సామాన్యులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవ్దానికి సిద్ధమవుతోంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. బ్యాంకులు, ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతున్నాయి.

    జూన్ నెల 30వ తేదీన వడ్డీ రేట్ల అంశంపై సమీక్ష జరగనుందని తెలుస్తోంది. జులై నెల 1వ తేదీ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు అమలులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల క్రితమే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించగా ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గడం గమనార్హం. కేంద్రం పొరపాటున ఆదేశాలు జారీ అయ్యాయని చెబుతూ ఆ నిర్ణయం వెనక్కు తీసుకుంది.

    ప్రస్తుతం ఏడాది టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐ 5 శాతం వడ్డీని ఇస్తుండగా కేంద్రం అమలు చేస్తున్న ఒక్కో స్కీమ్ పై ఒక్కో వడ్డీరేటు అమలవుతోంది. కేంద్రం సుకన్య సమృద్ధి స్కీమ్ పై 7.6 శాతం వడ్డీని అందిస్తుండగా పీపీఎఫ్ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ, ఎన్ఎస్‌సీ స్కీమ్ పై 6.8 శాతం వడ్డీ, కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది.

    టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐ అందిస్తున్న వడ్డీతో పోలిస్తే ఇతర స్కీమ్ లలో ఎక్కువ మొత్తం వడ్డీ లభిస్తుండటం గమనార్హం. అయితే కేంద్రం వడ్డీరేట్లను తగ్గిస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కేంద్రం వడ్డీరేట్లను తగిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.