Homeబిజినెస్QJ SRK 421 RR sports bike: Kawasaki కంపెనీకి చెమటలు పుట్టిస్తున్న QJ.. ఫీచర్స్...

QJ SRK 421 RR sports bike: Kawasaki కంపెనీకి చెమటలు పుట్టిస్తున్న QJ.. ఫీచర్స్ సేమ్.. ధర మాత్రం తక్కువ..

QJ SRK 421 RR sports bike: ఆటో మోబైల్ మార్కెట్లో ప్రీమియం బైక్ ల హవా కొనసాగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ కంపెనీ Kawasaki నుంచి ప్రీమియం బైక్ లు మార్కెట్లోకి వచ్చి యూత్ ను తెగ ఆకట్టుకుంటాయి. అయితే దీనిని బీట్ చేయడానికి చైనా కంపెనీ కొత్తగా స్పోర్ట్స్ బైక్ ను ప్రవేశపెట్టింది. ఈ బైక్ తో ఇప్పటికే మార్కెట్లో ఉన్న కవాసకి బైక్ కంటే ధర తక్కువగా ఉండడంతో పాటు ఆకర్షణ ఏమైనా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ బైక్ ధర ఎలా ఉందంటే?

చైనా దేశానికి చెందిన వాహన దిగ్గజం QJ మోటార్స్ కొత్తగా SRK 421 RR బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ బైక్ తో కేవలం చైనాలో మాత్రమే కాకుండా యూరోపియన్ మార్కెట్లో తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో కవాసకి కంపెనీకి చెందిన నింజా ZX 4 RR అనే బైక్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే దీనికి పోటీగా QJ బైక్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కవాసకి నింజాZX 4 RR బైకును దాదాపు రూ. 10.74 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. కానీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన QJ SRK 421 RR ధర రూ. 6. 47 లక్షలు గా ఉంది.

క్యుజే బైక్ ధర తక్కువగా ఉన్నప్పటికీ ఇందులో ఫీచర్స్ మాత్రం నింజా బైక్ తో సమానంగా ఉన్నాయి. ఈ కొత్త బైక్ లో LED హెడ్ లాంప్ చిన్నగా కనిపిస్తుంది. హెడ్ లాంప్ లేయర్, ఎస్ డిసైడ్ ఫెయిరింగులను కలుపుతుంది. అంతేకాకుండా ఈ బైక్ ఫ్యాన్సీ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ తో కూడిన 7 అంగుళాల TFT స్క్రీన్, రెండు సైడ్ మోడ్ లు కనిపిస్తాయి. ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు ABS టెక్నాలజీ తో ఈ బైక్ కనిపిస్తుంది.

అలాగే ఇందులో 421 సిసి ఫోర్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉండనుంది. ఇది 14000 rpm వద్ద 76 బిహెచ్పి పవర్ ను అందిస్తుంది. అలాగే 39 ఎన్ ఎం టార్కును రిలీజ్ చేస్తుంది. మొత్తంగా చూస్తే నింజా బైక్ ZX 4RR కు దగ్గరగా ఉంటాయి. కానీ ఈ బైక్ లో ప్రత్యేకంగా USD పోర్క్ తో పాటు స్టీల్, అల్యూమినియం ఫ్రేమ్ వంటివి స్పెషల్ గా ఉండనున్నాయి. అలాగే చివర్లలో డిస్క్ బ్రేక్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version