సిక్స్ ప్యాక్ కోసం స్టార్ హీరోలు కాల్ చేస్తున్నారట !

హీరో సుధీర్‌బాబు సూరిబాబుగా మారి నటిస్తోన్న సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. కాగా సుధీర్ బాబు బర్త్‌ డే సందర్భంగా మొన్న ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ అయింది. గ్లింప్స్‌ అదిరిపోయిందనే టాక్ వచ్చినా.. ఆ విజువల్స్ లో ఎక్కువగా హైలైట్ గా నిలిచింది మాత్రం, సుధీర్ బాబు సిక్స్‌ ప్యాక్‌ బాడీనే. మాస్ హీరోలకే చేతకాని ఈ రేంజ్ బాడీని తానూ ఎలా సాధించాడో తాజాగా చెప్పుకొచ్చాడు. సుధీర్ బాబు తాజాగా ఓ […]

Written By: admin, Updated On : May 15, 2021 5:25 pm
Follow us on

హీరో సుధీర్‌బాబు సూరిబాబుగా మారి నటిస్తోన్న సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. కాగా సుధీర్ బాబు బర్త్‌ డే సందర్భంగా మొన్న ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ అయింది. గ్లింప్స్‌ అదిరిపోయిందనే టాక్ వచ్చినా.. ఆ విజువల్స్ లో ఎక్కువగా హైలైట్ గా నిలిచింది మాత్రం, సుధీర్ బాబు సిక్స్‌ ప్యాక్‌ బాడీనే. మాస్ హీరోలకే చేతకాని ఈ రేంజ్ బాడీని తానూ ఎలా సాధించాడో తాజాగా చెప్పుకొచ్చాడు.

సుధీర్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సిక్స్‌ ప్యాక్‌ గురించి తానూ ఏం చేశాడు ? అసలు అంత పర్ఫెక్ట్ గా సిక్స్ ప్యాక్ రావడానికి గల దాని వెనకున్న సీక్రెట్స్‌ ఏమిటి అనే విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. పైగా తన సిక్స్ ప్యాక్ గురించి తెలుసుకోవడానికి కొంతమంది స్టార్ హీరోలు కాల్‌ చేసి మరీ కనుక్కోవడానికి ఆసక్తి చూపించారట. మరి సిక్స్ ప్యాక్ కోసం చాలామంది హీరోలు ట్రై చేసి ఒళ్ళు హూనం చేసుకున్న సంఘటనలు కొన్ని గతంలో ఉన్నాయి.

అందుకే, హీరోలు ఎప్పుడూ ఈజీగా సిక్స్ ప్యాక్ ఎలా వస్తోంది అంటూ ఆరా తీస్తూ ఉంటారు. ఇంతకీ తన సిక్స్ ప్యాక్ పై సుధీర్ బాబు ఏమి చెప్పాడు అంటే.. ఆయన మాటల్లోనే ‘నేను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. అలాగే తీసుకునే ఫుడ్ టైమింగ్ తో పాటు మంచి డైట్‌ తీసుకుంటాను. మంచి డైట్‌ తో శరీరాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. నేనూ అదే చేసాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

మరి హీరోలూ మీకు సిక్స్ ప్యాక్ కావాలంటే మీ డైట్ విషయంలో మార్పులు ఉంటే చేసుకోండి. ఇక సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రానున్న సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. పైగా ఈ సినిమాలో ఉప్పెన భామ కృతిశెట్టి, సుధీర్‌ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.