Homeబిజినెస్Hero Vida VX2 electric scooter: రూ. 50 వేల లోపు చెల్లించి ఈ స్కూటర్లను...

Hero Vida VX2 electric scooter: రూ. 50 వేల లోపు చెల్లించి ఈ స్కూటర్లను కొనుగోలు చేయండి.. ఇంత తక్కువ ధర ఎందుకంటే…?

Hero Vida VX2 electric scooter: రోజువారి అవసరాల కోసం ఒకప్పుడు బైక్స్ కొనేవారు ఇప్పుడు స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి ఎలక్ట్రిక్ వేరియంట్ లో రావడంతో పాటు తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో చాలామంది చిన్నచిన్న అవసరాలకు కొనుగోలు చేస్తుండగా ఇంకొంతమంది సెకండ్ ఆప్షన్ గా ఈ స్కూటర్లను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు సైతం రూ. లక్షకు పైగా ధర పలుకుతోంది. దీంతో పెద్ద మొత్తంలో ఒకేసారి చెల్లించి కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. అయితే ఇలాంటి వారికి Baas అనే స్కీం ప్లస్ పాయింట్ గా మారింది. ప్రారంభంలో తక్కువ ధరలు చెల్లించి స్కూటర్ను కొనుగోలు చేయవచ్చు. అంటే రూ. 50 వేల లోపే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసి ఆ తర్వాత ప్రయాణం చేసే దాన్ని బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా Baas స్కీం కింద అందించే స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

Hero కంపెనీకి చెందిన ఎన్నో స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అలరించాయి. అయితే లేటెస్ట్ గా Vida VX2 అనే స్కూటర్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా దీనిని పొందే అవకాశం ఉంటుంది. దీని ధర ప్రస్తుతం రూ.99,490 తో విక్రయిస్తున్నారు. అయితే దీనిని రూ. 50 వేల లోపు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అంటే Baas (Battery As a Service) స్కీం కింద దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ విధానంలో ఈ స్కూటర్కు సంబంధించిన బ్యాటరీని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి కిలోమీటర్ కు రూ. 90 పైసల నుంచి రూ. 1.24 వరకు చార్జ్ విధించబడుతుంది. అంటే ప్రారంభంలో తక్కువ మొత్తంతో ఈ స్కూటర్ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో కొత్తగా స్కూటర్ కొనాలని అనుకునే వారితో పాటు సెకండ్ ఆప్షన్ గా దీనిని కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఇదే విధంగా మరో స్కూటర్ కూడా Bass విధానంలో కొనుగోలు చేయవచ్చు. అదే ఎలక్ట్రిక్ LXS. ఈ స్కూటర్ ను Baas ద్వారా కొనుగోలు చేస్తే రూ.49,999 కే వస్తుంది. ఈ స్కూటర్లో 2.3 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 89 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించే అవకాశం ఉంది. నగరాల్లో ఉండేవారు ఆఫీస్ అవసరాలకు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.

మరో ఎలక్ట్రికల్ స్కూటర్ ATher Rizta ను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా ప్రారంభంలో తక్కువ ధరలు చెల్లించి స్కూటర్ కొనాలని అనుకునే వారికి ఈ స్కూటర్లు అనుగుణంగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version