Stock Market : స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల వివరాలివిగో..?

దేశీయ మార్కెట్లు మంగళవారం ఉదయం కొంత నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రానికి లాభాల్లో ముగిసిన ఎస్ఈలు ఇలా నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Written By: Mahi, Updated On : August 27, 2024 6:18 pm

Strock market

Follow us on

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయా.. మంగళవారం ఉదయం 9.32 గంటలకు స్వల్ప నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 61 పాయింట్లు తగ్గింది. దీంతో 81,635 వద్ద ట్రేడవుతున్నది. ఇక నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 24, 989 వద్దకు చేరుకుంది. అయితే సోమవారం సాయంత్రం మాత్రం మంచి లాభాలతో ముగిసాయి. నిఫ్టీలోని 50 లిస్టెడ్ కంపెనీల్లో 33 లాభాల్లోనే కొనసాగాయి. ఇందులో హిందాల్కో, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్ కంపెనీలు అత్యధిక లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ లోని 30 స్టాక్ లలో 21 లాభాల్లోనే కొనసాగాయి. ఇందులో ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్ 4 శాతం మేర లాభాలు అందుకున్నాయి. ఇక మంగళవారం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఉదయాన్నే కొంత నష్టాలతో మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం అమెరికా డాలర్ ఇండెక్స్ 100.8 పాయింట్లకు చేరుకున్నాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 81 డాలర్ల వద్దకు చేరుకున్నాయి. గత సెషన్ లో అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అయితే సెప్టెంబర్ లో జరగబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని టాక్ వినిపిస్తున్నది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక గణంకాలు ఈ వారాంతన వెలువడనున్నాయి. జులై నెలకు సంబంధించిన మౌలిక సదుపాయాల రంగాల వివరాలు కూడా వెల్లడించనున్నారు. దీంతో పాటు దేశ, విదేశాల్లో నెలకొన్న పరిస్థితులు, రూపాయి కదలికలు కూడా మార్కెట్లను ప్రభావితంచేయనున్నాయి.

సోమవారం వరకు షేర్ల విక్రయాల వివరాలు..
కాగా, సోమవారం ఎఫ్ఐఐలు రూ. 483 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదేసమయంలో దేశీయ మదుపర్లు రూ. 1870.22 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. విదేశీ సంస్థాగత మదుపర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 30102.4 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో పాటు దేశీయ సంస్థాగత మదుపర్లు ఇప్పటివరకు రూ. 48950.6 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే మంగళవారం కొంత ఫ్లాటుగానే స్టాక్ మార్కెట్లు ప్రారంభమవుతాయని నిపుణులు అంచనా వేశారు. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్లు నష్టపోవడమే దీనికి కారణంగా కనిపిస్తున్నది.

బంగారం ధర తగ్గినట్లేనా..?
బంగారం ధరం మంగళవారం తగ్గినట్లుగా కనిపిస్తున్నది. తులం ధర రూ. 10 వరకు తగ్గినట్టుగా కనిపిస్తున్నది. ఇక ధరల వివరాలు చూసుకుంటే.. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, తదితర ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 67,900 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రామాలు బంగారం ధర రూ. 73,180 వద్ద ఉంది. ఇక చెన్నై, ఢిల్లీలో కూడా కొంత అటు ఇటుగా రేట్లు కనిపిస్తున్నాయి.

అయితే సోమవారం కంటే పెద్దగా పెరిగినట్లు మాత్రం కనిపించడం లేదు. ఇక దేశంలో వెండి ధరలు మాత్రం తగ్గడం లేదు. బంగారం ధరలో కొంత తగ్గుదల కనిపిస్తున్నా, వెండి ‘నేనస్సలు తగ్గను’ అన్నట్లే వెళ్తున్నది. మంగళవారం వెండి ధర చూసుకుంటే కేజీ రూ. 600 వరకు పెరిగి రూ. 93500 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో మాత్రం ఈ ధర రూ. 88500గా ఉంది. ప్రస్తుతం వెండి మార్కెట్లో గరిష్ఠస్థాయికి చేరుకుంది.