https://oktelugu.com/

Raj Tarun : లావణ్యతో ఎఫైర్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. రాజ్ తరుణ్ హాట్ కామెంట్స్!

ఆయన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి, ఇది ఎంత వరకు నిజం అని అడగగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తూ 'ఇప్పటి వరకు నా మెడకు చుట్టుకున్న నెగటివిటీ, కాంట్రవర్సీలు చాలు. నాకు బిగ్ బాస్ అసలు సూట్ అవ్వదు

Written By:
  • Vicky
  • , Updated On : August 27, 2024 / 06:36 PM IST

    Raj Tharun

    Follow us on

    Raj Tarun : ఇటీవల కాలం లో ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ మీడియా లో ఎంత సెన్సేషనల్ టాపిక్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే. లావణ్య తో ఒకప్పుడు ప్రేమాయణం నడిపిన ఆయన ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె నడవడిక నచ్చక విడిపోవడం, ఆ తర్వాత లావణ్య డ్రగ్స్ కేసు లో నార్సింగి పోలీసులకు పట్టుబడడం, మళ్ళీ ఆమె బయటకి వచ్చాక రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి వదిలేసాడని, మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడని, నా రాజ్ తరుణ్ నాకు కావాలి అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ సంఘటన మీద మీడియా లో ఎన్నో డిబేట్స్ కూడా నడిచాయి. మధ్యలో శేఖర్ భాషా అనే వ్యక్తి ఈ వ్యవహారంలోకి తలదూర్చి లావణ్య అసలు రంగు బయటపెట్టడం తో ఈ వివాదం మళ్ళీ చర్చల్లోకి రాలేదు.

    ఈ వివాదం జరుగుతున్న సమయంలో రాజ్ తరుణ్ కి సంబంధించి ‘పురుషోత్తముడు’, ‘తిరగబడ్డారు సామీ’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. కనీసం ప్రొమోషన్స్ కోసం ఖర్చు చేసిన డబ్బులను కూడా రాబట్టలేకపోయాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరో గా నటించిన మరో కొత్త చిత్రం ‘భలే ఉన్నాడే’ వచ్చే నెల 7 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి, ఇది ఎంత వరకు నిజం అని అడగగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తూ ‘ఇప్పటి వరకు నా మెడకు చుట్టుకున్న నెగటివిటీ, కాంట్రవర్సీలు చాలు. నాకు బిగ్ బాస్ అసలు సూట్ అవ్వదు, నేను అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను’ అంటూ చెప్పుకొచ్చాడు. గతం లో ఇలాంటి వివాదాల్లో చిక్కుకొని నా సినిమాలను సరిగా ప్రమోట్ చేయలేకపోయానని, ఇక నుండి నా పూర్తి ద్రుష్టి సినిమాల మీదనే ఉంటుందని రాజ్ తరుణ్ వ్యాఖ్యానించాడు.

    ఈమధ్య మీ వివాదం పై చర్చలు సడన్ గా ఆగిపోయాయి ఎలా? అని యాంకర్ అడగగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తూ ‘ఆగిపోయేందుకు నేనేమి చెయ్యలేదండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 7 న విడుదల కాబోతున్న రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’ చిత్రం పై, ఆయన గత రెండు సినిమాలకంటే ట్రేడ్ లో మంచి బజ్ ఉంది. క్వాలిటీ విషయంలో కూడా ఈ చిత్రం ట్రైలర్ చూసేందుకు ఎంతో బాగుంది. ఇందులో రాజ్ తరుణ్ ‘గే’ పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా విన్నూతన రీతిలో ప్లాన్ చేసారు మేకర్స్. చూడాలి మరి ఈ చిత్రంతోనైనా రాజ్ తరుణ్ హిట్ కొడతాడా లేదా అనేది.