Skoda Cars
Skoda : చాలా మంది షోరూంలకు వెళ్లినప్పుడు తమకు నచ్చిన కలర్ కార్లు అందుబాటులో ఉండవు. దీంతో రాజీ పడి వేరే కలర్ కార్ కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు స్కోడా బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు మీకు ఇష్టమైన రంగులో స్కోడా కుషాక్, స్కోడా స్లావియా వంటి కార్లను కొనుగోలు చేయవచ్చు. కాకపోతే మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు సెలక్ట్ చేసుకున్న మోనోటోన్ , డ్యూయల్-టోన్ రంగులలో కొనుటోలు చేయాలంటే ఆ మోడల్ మీద రూ.10వేలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల రెండు కార్లను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేశారు. వాటి ధరలు కూడా మారిపోయాయి.
Also Read : కంపెనీ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన మోడల్.. ఫిబ్రవరిలో కొన్నది కేవలం 12మందే
ఎంట్రీ లెవల్ కుషాక్ క్లాసిక్ క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, టోర్నాడో రెడ్, కార్బన్ స్టీల్ రంగులలో స్టాండర్డ్‌గా లభిస్తుంది. అయితే లావా బ్లూ మాత్రం ప్రీమియం. అదే సమయంలో, టాప్-స్పెక్ కుషాక్ ప్రెస్టీజ్ 6 మోనోటోన్, 2 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో స్టాండర్డ్ గా వస్తుంది. కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్ డ్యూయల్ టోన్, లావా బ్లూ డ్యూయల్ టోన్ కంపెనీ ఎక్రస్ ట్రా ఆఫ్షన్లు. ఈ సెలెక్టెడ్ ఆఫ్షన్ కలర్స్ కు రూ. 10,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కుషాక్ ధరల్లో కాస్త మార్పులను చేసింది కంపెనీ. మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటాతో పోటీపడే కుషాక్ ధర ఇప్పుడు రూ. 10.99 లక్షల నుంచి రూ. 19.11 లక్షల మధ్య ఉంది.
స్లావియాతో లభించే రంగు ఎంపికలు కుషాక్ మాదిరిగానే ఉంటాయి. ఎంట్రీ లెవల్ స్లావియా క్లాసిక్ క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, టోర్నాడో రెడ్, కార్బన్ స్టీల్ రంగులలో కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది. అయితే స్కోడా లావా బ్లూ ఫినిషింగ్ ధర రూ. 10,000 ఎక్కువ. టాప్-స్పెక్ స్లావియా ప్రెస్టీజ్ 6 మోనోటోన్, 2 డ్యూయల్-టోన్ రంగులలో అమ్ముడవుతోంది. కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్ డ్యూయల్ టోన్, లావా బ్లూ డ్యూయల్ టోన్ ఆఫ్షనల్ గా ఉంటాయి. ఈ సెలెక్టెడ్ కలర్ ఆఫ్షన్లలో స్లావియా ధర ఇప్పుడు రూ. 10.34 లక్షలు – రూ. 18.34 లక్షలు. చెక్ ఆటోమేకర్ కైలాక్‌ను ప్రవేశపెట్టడంతో కొన్ని రంగులకు విడిగా ఛార్జ్ చేయడం మొదలు పెట్టింది.
రెండు మోడళ్లు 115hp, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తాయి. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. రెండవది 150hp, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటో గేర్‌బాక్స్‌తో రానుంది. స్కోడా భారతదేశంలో కొన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కొత్త స్కోడా కోడియాక్ ఏప్రిల్‌లో వచ్చే అవకాశం ఉంది. ఆక్టేవియా ఆర్‌ఎస్, ఆక్టేవియా డీజిల్ కూడా సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఈ ఎస్యూవీ పై ఏకంగా రూ.1.5లక్షల డిస్కౌంట్.. ఆఫర్ పోతే మళ్లీ రాదు