Jeep Grand Cherokee
Jeep Grand Cherokee :జీప్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో మొత్తం నాలుగు మోడల్స్ విక్రయిస్తోంది. దాని అన్ని మోడళ్లు ప్రీమియం, లగ్జరీనే. దీని కారణంగా దాని అమ్మకాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, ఫిబ్రవరిలో గత 6 నెలల్లో కంపెనీ తన రెండో అత్యల్ప అమ్మకాలను నమోదు చేసింది. జీప్ గ్రాండ్ చెరోకీ ఆ బ్రాండ్ అమ్మకాల జాబితాలో అత్యల్పంగా అమ్ముడైన కారు. గత నెలలో దీనికి 12 మంది కస్టమర్లు మాత్రమే వచ్చారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు దానిలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి నిరంతరం భారీ డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. ఈ నెల కూడా ఈ మోడల్ మీద రూ. 3 లక్షల తగ్గింపు అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.50 లక్షలు .. దీన్ని ఈఎంఐ ఆఫ్షన్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. 84 నెలలకు రూ. 84,166ఈఎంఐకి కూడా కొనుగోలు చేయవచ్చు.
Also Read : ఈ ఎస్యూవీ పై ఏకంగా రూ.1.5లక్షల డిస్కౌంట్.. ఆఫర్ పోతే మళ్లీ రాదు
ఇది దాని పాత మోడల్ కంటే షార్ఫ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది స్లీక్ హెడ్ లైట్స్, టెయిల్‌లైట్లతో ఉంటుంది. జీప్ సిగ్నేచర్ 7-స్లాట్ గ్రిల్, ‘జీప్’ లోగో దాని ముందు భాగంలో చూడవచ్చు. స్కేర్ షేప్ వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్, 20-ఇంచుల, మెటాలిక్ అల్లాయ్ వీల్స్ గ్రాండ్ చెరోకీకి అట్రాక్షన్ అందజేస్తుంది. వెనుక భాగంలో ఇది స్లీక్ LED టెయిల్ లైట్లు, క్రోమ్ సరౌండ్‌తో వెనుక విండ్‌షీల్డ్‌ను పొందుతుంది.
ఈ SUV 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది.ఇది 270 hp పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్‌రోడింగ్ విషయానికొస్తే, ఇది భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఇతర SUV లను అధిగమిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 215 మి.మీ., దీని కారణంగా గ్రాండ్ చెరోకీ నీటిలో 533 మి.మీ. లోతు వరకు పరుగెత్తగలదు. జీప్ గ్రాండ్ చెరోకీ ఒకే వేరియంట్, 4 రంగులలో లభిస్తుంది.
దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది 10.25-ఇంచుల ఫ్రంట్ కో-ప్యాసింజర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో క్లాస్-లీడింగ్ టెక్నాలజీని అందిస్తుంది. ఇందులో 10.25-ఇంచుల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.0-అంగుళాల హెడ్-అప్ డిస్ప్లే, 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ లైన్లో కూర్చున్న వాళ్లకు ఇది 10-ఇంచుల 4K డిస్ప్లేతో వస్తుంది. దీనికి 1,076 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
అంతే కాకుండా ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, సరౌండ్ వ్యూ కెమెరా, వెంటిలేషన్‌తో కూడిన లెదర్ సీట్లు, 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టెర్రైన్ రెస్పాన్స్ మోడ్, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), హిల్ స్టార్ట్ అసిస్ట్, రెయిన్ బ్రేక్ సపోర్ట్, హెడ్-అప్ డిస్ప్లే, సరౌండ్ వ్యూ కెమెరా వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.